Advertisement

  • ఫన్ని వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన అనుసూయ

ఫన్ని వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన అనుసూయ

By: chandrasekar Thu, 09 July 2020 2:51 PM

ఫన్ని వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన అనుసూయ


తెలుగు టెలివిజన్ తెరపై 'జబర్దస్త్' కామెడీ షోతో పాపులర్ అయిన అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్. అయితే అనసూయ కేవలం యాంకరింగ్ మాత్రమే కాకుండా వీలున్నప్పడల్లా సినిమాల్లోను నటిస్తూ అక్కడ కూడా అదగొడుతోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన

'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది అనసూయ. ఆ సినిమాలో రంగమ్మత్తగా అదరగొడుతూ ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. ఇంకా చెప్పాలంటే రంగమ్మత్తగా అనసూయను తప్పా మరోకరిని ఊహించుకోలేము. అంతలా మెప్పించింది అనసూయ. అలా అటూ డిగ్లామర్ పాత్రల్లో నటిస్తూనే అప్పుడప్పుడూ గ్లామర్ పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. రంగస్థలంలో అనసూయ చేసిన పాత్రతో ఇంప్రెస్ అయిన కృష్ణ వంశీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చారట.

కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ అనే సినిమాలో అనసూయ నటిస్తోన్న సంగతి తెలిసిందే. మరాఠీ లో సూపర్ హిట్ అయిన నట సమ్రాట్ చిత్రాన్ని తెలుగులో రంగమార్తాండ అనే పేరుతో రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు.

అది అలా ఉంటే దాదాపు రెండు నెలల కరోనా లాక్ డౌన్ తర్వాత ప్రభుత్వ అనుమతితో షూటింగ్స్ జరుకుంటోంది. సినీ అండ్ టెలివిజన్ పరిశ్రమ. దీంతో టీవీలకు సంబందించిన వివిధ కార్యక్రమాలు, రియాలిటీ షోస్ షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అందులో భాగంగా అనసూయ కూడా షూటింగ్స్‌లో పాల్గొంటోంది.

ఈ భామ రంగస్థలం అనే ఓ రియాలిటీ షోకు యాంకరింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. దానికి సంబందించిన ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. గతంలో వివిధ ఎపిసోడ్స్‌లో జరిగిన ఫన్ని మూమెంట్స్‌ను ఎడిట్ చేసి పంచుకుంది. ఆ వీడియోలో నటి, కమెడియన్ రోహిణి యాంకర్ అనసూయకు లిప్ టు లిప్ కిస్స్ ఇవ్వబోయింది. దానికి ప్రతి స్పందనగా అనసూయ ఏదో ముద్దు ఇస్తే తూడిచివేసినట్లు యాక్ట్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది.

Tags :
|

Advertisement