Advertisement

  • నేను ప్రస్తుతం ఏ కొత్త సినిమా ఒప్పుకోలేదు ..అవన్నీ ఫేక్ న్యూస్ ...అనసూయ

నేను ప్రస్తుతం ఏ కొత్త సినిమా ఒప్పుకోలేదు ..అవన్నీ ఫేక్ న్యూస్ ...అనసూయ

By: Sankar Sat, 25 July 2020 2:17 PM

నేను ప్రస్తుతం ఏ కొత్త సినిమా ఒప్పుకోలేదు ..అవన్నీ ఫేక్ న్యూస్ ...అనసూయ



ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఒకవైపు యాంకరింగ్ , మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలతో దూసుకుపోతున్నారు స్టార్ యాంకర్ అనసూయ ..తీరిక లేని బిజీ షెడ్యూలుతో గడుపుతున్న ఆనసూయ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఉన్నారు ..అయితే అనసూయ ఆ పాత్ర చేస్తుంది , ఈ పాత్ర చేస్తుంది అని వార్తలు అనేకము వస్తున్నాయి ..అయితే అనసూయ ఆ వార్తలకు చెక్ పెట్టారు ..

యంగ్ హీరో సుమంత్ అశ్విన్ నటిస్తున్న కొత్త చిత్రంలో అనసూయ భరద్వాజ్ నటించనుందని, ముందుగా ఈ పాత్ర కోసం గతంలో ఇంద్రజను ఖరారు చేసినప్పటికీ.. ఇప్పుడు ఆమె స్థానాన్ని అనసూయ భర్తీ చేయనున్నారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న ఇంద్రజ కరోనా వైరస్ తాండవం చేస్తోన్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో హైదరాబాద్ రావడానికి నిరాకరించడంతో ఆమె స్థానంలో అనసూయను తీసుకున్నారని టాక్ నడుస్తోంది. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించిన అనసూయ అందులో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది.

కరోనా మహమ్మారి కారణంగా టీవీ షూటింగులకే వెళ్లడం లేదు.. ఇక కొత్త సినిమాలు ఒప్పుకునే ఛాన్స్ ఎక్కడ ఉంది? అదంతా ఫేక్.. నమ్మకండి అని చెప్పేసింది జబర్దస్త్ బ్యూటీ. దీంతో తల్లి పాత్రలో అనసూయ కనిపించనుందనే వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది

Tags :
|

Advertisement