Advertisement

  • కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 12 షూటింగ్లో అమితాబ్

కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 12 షూటింగ్లో అమితాబ్

By: chandrasekar Mon, 24 Aug 2020 4:51 PM

కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 12 షూటింగ్లో అమితాబ్


కరోనా పై పోరాడి గెలిచిన తర్వాత 14 రోజులుకు పైగా హోం క్వారంటైన్‌లో ఉండి పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నారు అమితాబ్ బచ్చన్. దీంతో ఆయన యథావిధిగా మళ్లీ షూటింగ్స్‌ ప్రారంభించారు. అందులో భాగంగా కౌన్ బనేగా కరోడ్ పతి సీజన్ 12 షూటింగ్‌లో పాల్గొన్నట్టు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసారు. గతంలో కేబీసీ షూటింగ్ చేస్తున్న సమయంలో అమితాబ్ బచ్చన్ కరోనా బారిన పడ్డారు.

బిగ్‌బీ కరోనా బారిన పడటంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులైన కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్యర్యా రాయ్ బచ్చన్, మనవరాలు ఆరాధ్య కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత కుటుంబం మొత్తం కరోనా నుంచి కోలుకున్నారు.తాజాగా కేబీసీ 12 సీజన్ షూటింగ్‌ను కరోనా నియమ నిబంధలను అనుసరిస్తూ షూటింగ్ ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేబీసీ ఈ యేడాది 20 యేళ్లు పూర్తి చేసుకోబోతుందని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సెట్‌లో బ్లూ కలర్ పీపీఈ కిట్స్ ధరించిన వారితో కలిసి షూటింగ్ చేస్తున్నామన్నారు.

Tags :
|

Advertisement