Advertisement

  • త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నయి అల్లు ఫ్యామిలీలో...!

త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నయి అల్లు ఫ్యామిలీలో...!

By: Anji Thu, 17 Dec 2020 3:28 PM

త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నయి అల్లు ఫ్యామిలీలో...!

మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగిన విషయం తెలిసిందే, నాగ‌బాబు కుమార్తె నిహారిక‌, చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ వివాహం వైభ‌వంగా ఉద‌య్‌విలాస్ ప్యాలెస్‌లో జ‌రిగింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో వివాహానంత‌ర సంబ‌రాలు జ‌రుగుతున్నాయి.

ఇక తాజాగా ఇప్పుడు పెళ్లి బాజాలు మోగే వంతు అల్లు ఫ్యామిలీకి వ‌చ్చింద‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో గ‌ట్టిగా వినిపిస్తోంది. అల్లు అర‌వింద్ చిన్న కుమారుడు శిరీష్ పెళ్లి 2021లో జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌నేది ఆ ఫ్యామిలీ స‌న్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట‌.

ఇదే విష‌యాన్ని చూచాయ‌గా సాయిధ‌ర‌మ్ తేజ్ కూడా చెప్పేశాడు. లేటెస్ట్‌గా అత‌ను 'సోలో బ్ర‌తుకే సో బెట‌ర్' సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా విడుద‌ల స‌మీపిస్తున్న స‌మ‌యంలో జ‌రిగిన ప్ర‌మోష‌నల్ ఈవెంట్‌లో త‌న పెళ్లి గురించి ఎదురైన ప్ర‌శ్న‌కు సాయితేజ్ జ‌వాబిస్తూ, "శిరీష్‌ నాకంటే పెద్దవాడు.

వచ్చే ఏడాది తన పెళ్లి జరగవచ్చు. నేను పెళ్లి చేసుకునేందుకు ఇంకా సమయం ఉంది. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటిని పెళ్లికి ముందే పూర్తి చేయాలి" అని చెప్పాడు. దీంతో శిరీష్ పెళ్లి వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూరిన‌ట్ల‌యింది.

శిరీష్ వ‌య‌సు 33 సంవ‌త్స‌రాలు. అల్లు అర్జున్ 27 సంవ‌త్స‌రాల‌కే పెళ్లి చేసుకున్నాడు. అత‌డి పెళ్ల‌యి వ‌చ్చే మార్చికి ప‌దేళ్లు నిండుతాయి.

ఇప్ప‌టికే పెళ్లి చేసుకొమ్మంటూ ఇంట్లో నుంచి శిరీష్‌కు ఒత్తిడి వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో 2021లో అల్లు ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది.

Tags :

Advertisement