Advertisement

కరోనా నెగెటివ్ వచ్చింది ..అల్లు శిరీష్

By: Sankar Wed, 30 Dec 2020 7:50 PM

కరోనా  నెగెటివ్ వచ్చింది ..అల్లు శిరీష్


మెగా ఫ్యామిలీలో కరోనా వైరస్ సృష్టిస్తోన్న ప్రకంపనల గురించి అందరికీ తెలిసిందే. వరుసగా మెగా హీరోలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, వరుణ్ తేజ్ కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో మరో మెగా హీరో అల్లు శిరీష్ తనకు కరోనా రాలేదని తెలిపాడు. రెండు సార్లు టెస్ట్ చేయించుకున్నానని... రెండు టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని చెప్పాడు.

సాధారణంగా కోవిడ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. షూటింగ్ లో ప్రతి రోజు దాదాపు 100 మందితో కలసి పని చేసేవాడినని చెప్పాడు. మాస్క్ ధరించేవాడినని, శానిటైజర్ వాడేవాడినని, అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపాడు.

కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు మాస్కులను ధరించడంతో పాటు మనకు అందుబాటులో ఉన్న సంప్రదాయ నివారణ మార్గాలను అనుసరించాలని అల్లు శిరీష్ తెలిపాడు.

Tags :
|
|

Advertisement