Advertisement

  • బన్నీ వాసు కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్

బన్నీ వాసు కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్

By: Sankar Mon, 14 Dec 2020 9:36 PM

బన్నీ వాసు కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్


హీరో అల్లు అర్జున్ నిర్మాత బన్నీ వాసును ‌పరామర్శించారు. ఇటీవల వాసు సోదరుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిహారిక వివాహం కావడంతో జోధ్‌పూర్‌లో ఉన్న అల్లు అర్జున్‌ ఇటీవల హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు.

ఈ క్రమంలో బన్నీ, ఆయన సోదరుడు అల్లు శీరిష్‌, డైరెక్టర్‌ సుకుమార్‌లు సోమవారం బన్నీ వాసు స్వగ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోల్లులోని ఆయన ఇంటికి వెళ్లారు. నిర్మాత బన్ని వాసును, ఆయన కటుంబసభ్యులను పరామర్శించారు. వాసు సోదరుని మృతి పట్ల సంతాపం తెలిపారు.

కొంతకాలంగా కిడ్ని సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడ్డ బన్నీ వాసు సోదరుడు సురేష్‌ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత శుక్రవారం కన్నుమూశారు..కాగా బన్నీ వయసుకు , అల్లు కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది...గీత ఆర్ట్స్ బ్యానర్ లో తీసే సినిమాలకు సహా నిర్మాతగా వ్యవహరించే బన్నీ వాసు ఇటీవలే సొంతంగా నిర్మాతగా కూడా మారాడు...

Tags :
|

Advertisement