Advertisement

  • పలాసా 1978 టీమ్ ను అభినందించిన అల్లు అర్జున్..!

పలాసా 1978 టీమ్ ను అభినందించిన అల్లు అర్జున్..!

By: Anji Fri, 02 Oct 2020 5:05 PM

పలాసా 1978 టీమ్ ను అభినందించిన అల్లు అర్జున్..!

ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఓ యదార్థ గాథ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పలాస 1978. కరుణ కుమార్ దర్శకత్వంలొ అప్పారావు బెల్లాన, అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. రఘు కుంచె సంగీతాన్ని, విన్సెంట్ అరుల్ సినిమాటోగ్రఫీ ని అందించారు.

1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ద‌ర్శ‌కుడు చిత్రాన్ని తెర‌కెక్కించారు. కుల వివక్ష.. అప్పటికీ, ఇప్పటికీ సమాజం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ఇలాంటి అతి సున్నితమైన అంశాన్నే కథాంశంగా తీసుకుని తెర‌కెక్కించారు.

ఈ సినిమా చక్కటి విజయాన్ని సాధించడం తో చిత్ర యూనిట్ ను అల్లు అర్జున్ అభినదించారు. పలాసా 1978 మూవీ బృందానికి అభినందనలు. ఈ చిత్రాన్ని చూసిన‌ మరుసటి రోజు ఉదయం దర్శకుడిని కలిశాను. గొప్ప అంతర్లీన సందేశంతో అద్భుతమైన ప్రయత్నం చేశారు. వ్య‌క్తిగతంగా చిత్రం చాలా న‌చ్చింది.

చాలా మంచి పాయింట్స్ ఉన్నాయి అంటూ బ‌న్నీ.. ప‌లాస ద‌ర్శ‌కుడితో దిగిన ఫోటో షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు. బ‌న్నీ ట్వీట్‌కు స్పందించిన ప‌లాస ద‌ర్శ‌కుడు కరుణ కమార్.. మంచి సినిమాను ప్రోత్సహిస్తూ తన అభినందనలు అందజేసిన అల్లు అర్జున్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు . తన జీవితంలో ఇదొక అద్భుత జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ కరుణ కుమార్ ట్వీట్ చేశారు.

Tags :

Advertisement