Advertisement

  • యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించిన స్టైలిష్ స్టార్ 'సరైనోడు '..

యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించిన స్టైలిష్ స్టార్ 'సరైనోడు '..

By: Sankar Wed, 15 July 2020 9:35 PM

యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ సాధించిన స్టైలిష్ స్టార్ 'సరైనోడు '..



తెలుగులో విడుదల అయినా సినిమాలో యూట్యూబ్ లో హిందీ భాషలో దుమ్ములేపుతున్నాయి ..ఇక్కడ అంతగా విజయం సాధించని సినిమాలు కూడా యూట్యూబ్ లో మాత్రం భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి ..అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా తెలుగులో ఘానా విజయం సాధించిన విషయం తెలిసిందే..

ఇప్పుడు ‘సరైనోడు’ యూట్యూబ్‌లో దుమ్ముదులుపుతోంది. రికార్డ్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ‘సరైనోడు’ హిందీ అనువాద చిత్రం బుధవారం 300 మిలియన్ వ్యూస్ మార్క్‌ను అందుకుంది. అంటే, ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా ఈ సినిమాను యూట్యూబ్‌లో వీక్షించారు. కాగా, యూట్యూబ్‌లో 300 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘సరైనోడు’ హిందీ వెర్షన్ నిలిచింది. అంతేకాదు, ఈ సినిమాకు 1 మిలియన్ లైక్స్ కూడా వచ్చాయి.

ఈ సూపర్ హిట్ సినిమా హిందీ అనువాద హక్కులను బాలీవుడ్‌కు చెందిన గోల్డ్‌మైన్స్ టెలీఫిలింస్ సంస్థ కొనుగోలు చేసింది. హిందీలోకి అనువాదం చేసి ‘సరైనోడు’ టైటిల్‌తోనే యూట్యూబ్‌లో విడుదల చేసింది. 2018 డిసెంబర్‌లో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ చిత్రం రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టింది.గతేడాది ఆగస్టులో ఈ సినిమా 200 మిలియన్ మార్కును అందుకోగా.. ఇంచుమించుగా ఏడాది కాలంలో మరో 100 మిలియన్ వ్యూస్ సాధించింది. సౌత్ స్టార్స్‌కు హిందీ సినిమా ప్రేక్షకుల్లో ఆదరణ పెరుగుతుండటంతో ఇక్కడి సినిమాలను అనువాదం చేసి యూట్యూబ్‌లో విడుదల చేస్తున్నారు.

Tags :
|
|

Advertisement