Advertisement

  • దేవి, సుకుమార్‌ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ పాల్గొన్ని ‘పుష్ప’ పాటలను సిద్ధం చేశారు

దేవి, సుకుమార్‌ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ పాల్గొన్ని ‘పుష్ప’ పాటలను సిద్ధం చేశారు

By: chandrasekar Wed, 08 July 2020 12:09 PM

దేవి, సుకుమార్‌ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ పాల్గొన్ని ‘పుష్ప’ పాటలను సిద్ధం చేశారు


సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కలయికలో సినిమా అనగానే సంగీత ప్రియులకు పండగే. ఈ ద్వయం కలయికలో అల్లు అర్జున్‌ హీరోగా ‘పుష్ప’ అనే మూవీ రూపొందుతుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య నుంచి రంగస్థలం వరకు ప్రతి సినిమా మ్యూజికల్‌ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా చిత్రీకరణ వాయిదాపడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్‌ సమయంలో సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్‌ మధ్య జూమ్‌ యాప్‌లో వర్చువల్‌ మ్యూజికల్ సిట్గింగ్స్‌ జరుగుతున్నాయి.

ఇంతకు ముందు అల్లు అర్జున్, దేవి, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఆర్య, ఆర్య-2కు మించిన పాటలు ఇవ్వాలనే సంకల్పంతో దేవి ‘పుష్ఫ’కు వర్క్‌ చేస్తున్నాడట. బన్నీ గత చిత్రం ‘అల వైకుంఠపురంలో’ సినిమా మ్యూజికల్‌గా హిట్‌ కావడంతో దేవిపై ఆ ఒత్తిడి కూడా ఉంది. దీంతో ‘పుష్ఫ’ మ్యూజిక్‌ను దేవి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడట. సినిమా చిత్రీకరణకు ముందే పాటలన్నీ రెడీ చేయాలని.. అదే ఉత్సాహంతో దేవి, సుకుమార్‌ మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ పాల్గొన్ని పాటలను సిద్ధం చేశారని సమాచారం. సో ‘పుష్ఫ’ కూడా మ్యూజికల్‌గా సరికొత్త సన్సేషన్‌ క్రియేట్‌ చేస్తుందేమో వేచివుండాలి.

Tags :
|
|
|

Advertisement