Advertisement

  • లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్... యోవ్… పుష్పరాజ్ ఒచ్చేసాడు..!

లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్... యోవ్… పుష్పరాజ్ ఒచ్చేసాడు..!

By: Anji Thu, 12 Nov 2020 4:08 PM

లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్... యోవ్… పుష్పరాజ్ ఒచ్చేసాడు..!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నా పుష్ప సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి..

దీంతో మూడో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి.. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ నవంబర్ 10నుండీ ప్రారంభమయ్యింది.

నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగునుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈసినిమాని మైత్రీ మూవీమేకర్స్ అందిస్తుంది.

అయితే చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీమేకర్స్ సెట్స్ పై అల్లు అర్జున్ ఫొటోను “యోవ్… పుష్పరాజ్ ఒచ్చేసాడు…!” అంటూ ఓ చిత్రాన్ని రీలీజ్ చేసింది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Tags :
|

Advertisement