Advertisement

  • బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... ఆ యాప్ పేరు అల్లు అర్జున్ ఆర్మీ

బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... ఆ యాప్ పేరు అల్లు అర్జున్ ఆర్మీ

By: Anji Thu, 17 Dec 2020 8:25 PM

బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్... ఆ యాప్ పేరు అల్లు అర్జున్ ఆర్మీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ఏ రేంజ్ లో అభిమానులుంటారో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు , తమిళ్ ఇలా అన్ని భాషల్లో బన్నీ కోసం ప్రాణం ఇచ్చే వీరాభిమానులు ఉన్నారు.

ఇప్పుడు అలాంటి అభిమానుల కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ను లాంచ్ చేయనున్నారు. అల్లు అర్జున్ కు సంబందించిన విశేషాలను ఎప్పటికప్పుడు ఆ యాప్ ద్వారా తెలియజేస్తారట. ఈ యాప్ కు అల్లు అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టారు. దీనిని డిసెంబర్ 23 న లాంచ్ చేయనున్నారు.

ఇక ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నాడు.

గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రం తెర‌కెక్క‌గా, ఇందులో అల్లు అర్జున్ డిఫ‌రెంట్ లుక్‌లో కనిపించి అల‌రించ‌నున్నాడు.

ర‌ష్మిక మంధాన క‌థ‌నాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. వ‌చ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చే ప్లాన్ చేస్తున్నారు.

Tags :

Advertisement