Advertisement

  • స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరొక రికార్డు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరొక రికార్డు

By: Sankar Tue, 18 Aug 2020 7:18 PM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖాతాలో మరొక రికార్డు


టాలీవుడ్ లో ప్రస్తుతం అత్యధిక ఫాలోయింగ్ ఉన్న నటులలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఒకరు..సినిమా సినిమా కు స్టైల్ పరంగా ఎప్పుడు కొత్తదనం చూయించే అల్లు అర్జున్ కు టాలీవుడ్ లోనే గాక , కేరళ లో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

ఇటీవల ఆయన చేసిన అల వైకుంఠపురం ఘన విజయాన్ని సాధించి ఎన్నో రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్‌ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతి తక్కువ కాలంలోనే 8 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను సాధించిన ఘనత సాధించారు.

ఈ సందర్భంగా అ‍ల్లు అర్జున్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆయన అభిమానులందరికి కృతజ్ఞతలు తెలిపారు. 8 మిలియన్స్‌ అనేది కేవలం ఫాలోవర్స్‌ కాదు, అది నెంబర్‌ , స్టాటిస్టిక్స్‌, పాపులారిటి కాదు అది అంతులేనంత అభిమానం, ఆశీర్వదం. మీ అందరి ప్రేమాభిమానాలకు నా కృతజ్ఞతలు. నేను శిరసు వంచి మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని రాసి ఒక పోస్టర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

దీంతో ఆయన అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అల్లు అర్జున్‌ ప్రస్తుతం నటిస్తున్న పుష్ప షూటింగ్‌ త్వరలోనే తిరిగి ప్రారంభం కానుంది. ఇక అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రం దర్శకుడు కొరటాల శివతో చేయనున్న విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement