Advertisement

  • ఓ డైహార్డ్ ఫ్యాన్‌ కు సర్ ప్రైజ్ ఇచ్చిన బన్నీ

ఓ డైహార్డ్ ఫ్యాన్‌ కు సర్ ప్రైజ్ ఇచ్చిన బన్నీ

By: Anji Sat, 03 Oct 2020 9:44 PM

ఓ డైహార్డ్ ఫ్యాన్‌ కు సర్ ప్రైజ్ ఇచ్చిన బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ నుండి సినిమా వస్తుందంటే యావత్ అభిమానులు పెద్ద పండగలా భావిస్తారు. అలాంటి ఓ డైహార్డ్ ఫ్యాన్‌ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు బన్నీ. బన్నీ అంటే ఎంతో ఇష్టపడే నాగేశ్వరరావు అనే అభిమాని తన స్వగ్రామం మాచర్ల మండలం ఖమ్మం పాడు నుంచి హైద‌రాబాద్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే అతడిని ఆపి హైదరాబాద్ తీసుకుర్మని తన టీమ్ కు చెప్పారు. అప్ప‌టి నుండి అల్లు అర్జున్ టీం అంతా అత‌ని కాంటాక్ట్ కోసం ప్ర‌యత్నాలు చేసినా, ఫలితం దక్కలేదు. చివ‌ర‌కి 6 రోజుల త‌రువాత హైద‌రాబాద్ చేరుకున్న నాగేశ్వరరావుని అల్లు అర్జున్ టీం క‌లిసి నిన్న సాయంత్రం బన్నీ వద్దకు తీసుకెళ్లారు.

అల్లు అర్జున్ నాగేశ్వరరావుని క‌లిసి యెగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రోజుకు 35 కిలోమీట‌ర్ల నుంచి 40 కిలోమీట‌ర్లు న‌డిచాను అని చెప్ప‌గానే ఒక్క క్ష‌ణం అల్లు అర్జున్ క‌ళ్లలో నీళ్లు తిరిగాయి. “ఎందుకు ఇలా చేశావు.. ఈరోజు కాక‌పోతే రేపు అభిమానుల్ని క‌లుస్తాను క‌దా ఇలా చేయ‌టం వ‌ల‌న మీ ఆరోగ్యం ఏమ‌యినా అయితే నేను ఎలా హ్య‌పిగా వుంటాను” బన్నీ అభిమానిని ప్రశ్నించాడు.

నాగేశ్వరరావు మాట్లాడుతూ.. “15 సంవ‌త్స‌రాల నుండి మీకు నేను పెద్ద అభిమానిని. మీ అన్ని ఫంక్ష‌న్స్ కి వ‌చ్చాను. మిమ్మ‌ల్ని క‌ల‌వ‌టమే ధ్యేయంగా అప్ప‌టిక‌ప్పుడు అనుకుని మా ఊరి నుంచి పాదయాత్ర మొదలు పెట్టాను” అని తెలిపాడు. అతడి మాటలకు స్పందించిన అల్లు అర్జున్.. “మాస్క్ వేసుకుని వ‌చ్చావు బాగుంది .. దారిలో గుళ్లలో ప‌డుకున్నాన‌ని చెప్తున్నావు.

చాలా క‌ష్ట‌ప‌డి వ‌చ్చావు బాగుంది. నా మీద నీకున్న అభిమానానికి చాలా హ్య‌పీగా ఉంది. కానీ ఇలా న‌డిచి రావ‌టం చాలా బాధగా ఉంది. ఇలాంటివి మీ భ‌విష్య‌త్తు కోసమో, మీ ఫ్యామిలి కొస‌మో చేస్తే అప్పుడు నేను చాలా గ‌ర్వంగా ఫీలవుతాను. మరోసారి ఇలా చెయ్యాలి అనుకుంటే మాత్రం నీ కోసం, నీ ఫ్యామిలీ కొసం చెయ్యి ” అని అల్లు అర్జున్ అభిమానికి చెప్పారు.

Tags :

Advertisement