Advertisement

  • ఆ కారణంగానే వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటున్నాను ..అల్లరి నరేష్

ఆ కారణంగానే వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటున్నాను ..అల్లరి నరేష్

By: Sankar Tue, 30 June 2020 11:24 AM

ఆ కారణంగానే వైవిద్యమైన పాత్రలను ఎంచుకుంటున్నాను ..అల్లరి నరేష్



అల్లరి నరేష్ ..కామెడీ హీరో పాత్రలకు తెలుగు ఇండస్ట్రీలో పెట్టింది పేరు ...తన కామెడీ సినిమాలతో అభిమానులను ఎంతగానో అలరిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ..అయితే ఇటీవలి కాలంలో అతడి సినిమాలు ఏవి ఆశించిన విజయం సాధించలేదు ..సుడిగాడు తర్వాత మల్లి ఆ స్థాయి హిట్ నరేష్ నుంచి రాలేదు ..దీనితో ఆయన రూట్ మార్చారు ..ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు తో మహర్షి సినిమాలో నటించి తనలోని సీరియస్ కోణాన్ని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేసాడు ..ఇప్పుడు కొత్తగా నాంది మూవీతో మరోసారి సీరియస్ పాత్ర వైపే మొగ్గు చూపాడు ..అయితే ఈ రోజు అయన బర్త్ డే కావడం వలన ఒక ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడారు ..

నరేష్ మాట్లాడుతూ నేను ఇండస్ట్రీకి వచ్చి 18ఏళ్లు అవుతోంది. ఇన్నేళ్లయినా కామెడీ రూట్‌ మార్చలేదని ప్రేక్షకులు అనుకుంటుంటారు. అందుకే ‘గమ్యం, ప్రాణం, నేను, శంభో శివ శంభో, మహర్షి’, ఇప్పుడు ‘నాంది’ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు చేశాను. నటుడిగా నేను నిరూపించుకోవాలి, బాగా పేరు రావాలంటే కథాబలం ఉన్న ఇలాంటి పాత్రలే చేయాలి. అయితే.. నాకు ఈ స్థాయిలో గుర్తింపు తెచ్చింది కామెడీనే. అది చేస్తూనే మధ్యలో కథా బలం ఉన్న సినిమాలు చేస్తుంటాను. ‘నాంది’ చిత్రం నా కెరీర్‌కి బ్రేక్‌ అవుతుంది. ఇందులో నగ్నంగా నటించాను.. ఆ పోస్టర్స్‌ చూసి నా ధైర్యానికి చాలా మంది మెచ్చుకున్నారు.

ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అన్నది కొత్త ప్రతిభావంతులకు వరం. సినిమాలను పెద్ద తెరపై చూసేందుకు ప్రేక్షకులు అలవాటుపడ్డారు. ఓటీటీ ఉంది కదా అని సెల్‌ఫోన్‌ లాంటి చిన్న స్క్రీన్‌లో ఎన్ని సినిమాలు చూస్తారు చెప్పండి? థియేటర్స్‌లో చూసే అనుభూతే వేరు.సినిమాలతో బిజీగానే ఉన్నా. వెబ్‌ సిరీస్‌లపై ఆసక్తి లేదు. పైగా వెబ్‌ సిరీస్‌లు సిటీ జనాలకే పరిమితం. గ్రామాలకు ఇంకా విస్తరించలేదు. గ్రామాలకు విస్తరించేందుకు ఇంకా రెండు మూడేళ్లు పడుతుంది. అప్పుడే ఎక్కువ మంది చూస్తారు.

నాన్నగారుంటే ఓ ధైర్యం.. మంచీ చెడూ చెప్పేవారు. మా కుటుంబానికి మర్రిచెట్టులాంటివారు. చాలా మందిని ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. నాన్నలేని లోటు మాత్రం ఎప్పుడూ తీరదు. నాన్న చనిపోయిన రెండేళ్లకు సరిగ్గా 2013 జనవరి 21న మా బాబాయ్‌ ఈవీవీ గిరిగారు కూడా చనిపోయారు. ఇద్దరి కొడుకుల్ని కోల్పోయిన మా నానమ్మ, తాతయ్యల బాధ వర్ణణాతీతం. నాన్న, బాబాయ్‌ చనిపోయిన రోజు జనవరి 21వ తేదీ అంటే భయపడుతుంటాం. ఆ రోజు ఎవరూ బయటికి వెళ్లడం లేదు. ఇంట్లోనే ఉంటున్నాం అని అన్నారు..


Tags :
|

Advertisement