Advertisement

  • సరికొత్త చిత్రానికి 'నాంది' పలికిన అల్లరి నరేష్

సరికొత్త చిత్రానికి 'నాంది' పలికిన అల్లరి నరేష్

By: Sankar Sun, 28 June 2020 10:40 AM

సరికొత్త చిత్రానికి 'నాంది' పలికిన అల్లరి నరేష్



అల్లరి నరేష్ ..తెలుగు లో ఒక దశాబ్దం నుంచి కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ..తన తండ్రి ఇవివి సత్యనారాయణ వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక పేరు తెచ్చుకున్నాడు ..అల్లరి నరేష్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనేలా పేరు సంపాదించాడు ..అయితే ఇటీవల కాలంలో నరేష్ కొంచెం స్పీడ్ తగ్గించాడు అత్యంత వేగంగా 50 సినిమాలు పూర్తి చేసిన అల్లరోడు ..కొన్ని పరాజయాలు రావడంతో కొంచెం బ్రేక్ ఇచ్చాడు ..తాజాగా ఒక డిఫరెంట్ మూవీతో మల్లి అభిమానులను పలకరిస్తున్నారు..

నరేష్ కెరియర్‌లో 57వ చిత్రంగా నాంది రాబోతుంది. పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా తలకిందులుగా వేలాడుతూ ఫస్ట్ లుక్‌తో సర్ ప్రైజ్ చేశారు అల్లరి నరేష్. ఇక జూన్ 30న ఆయన బర్త్ డే కావడంతో నాంది ఫ‌స్ట్ ఇంపాక్ట్ రివీల్ పేరట గ్లింప్స్‌ వీడియోను విడుదల చేయనున్నట్లు అల్లరి నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు.

ఈ సందర్భంగా ‘నాంది’ గ్లింప్స్‌కి సంబంధిచిన పోస్టర్‌ను విడుదల చేశారు అల్లరి నరేష్. పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా కింద కూర్చుని థర్డ్ డిగ్రీకి గురౌతున్నట్టు ఈ పోస్టర్‌లో కనిపిస్తుంది. జూన్ 30 మంగళవారం - మీరందరూ నాంది యొక్క ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ చేయడానికి సాక్ష్యంగా నిలవండి అంటూ ఈ పోస్టర్‌కి కామెంట్ జత చేశారు అల్లరి నరేష్.


Tags :

Advertisement