Advertisement

బాల‌కృష్ణ కు అసిస్టెంట్ గా స్టార్ హీరో!

By: Anji Mon, 14 Sept 2020 4:42 PM

బాల‌కృష్ణ కు అసిస్టెంట్ గా స్టార్ హీరో!

దర్శకుడు బోయపాటి శ్రీను - హీరో నందమూరి బాలకృష్ణ కలయికలో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే. రీసెంట్ గా బాలయ్య పుట్టిన రోజు సందర్భాంగా ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేసి దుమ్ములేపారు. ఈ టీజర్ లో మాస్ ఎలిమెంట్స్ గట్టిగానే చూపించడం తో సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉన్నట్లు అర్ధమవుతుంది.

ఇక తాజాగా ఈ మూవీ లో అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్లో వార్తలు గుసగుసలు గా వినిపిస్తున్నాయి. ప్లాష్ బ్యాక్ లో వ‌చ్చే బాల‌కృష్ణ అసిస్టెంట్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండ‌గా..కాస్త వినోదంగా సాగే ఈ పాత్ర కోసం అల్లరి న‌రేశ్ అయితే బాగుంటుంద‌ని బోయ‌పాటి అనుకుంటున్నాడ‌ని టాక్ .

మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం లో అల్లరి నరేష్ పాత్ర చూసి బోయపాటి ..ఈ పాత్రకు నరేష్ ను అనుకుంటున్నాడట. మరి శ్రీను ఆఫర్ కు నరేష్ ఎంచెపుతాడో చూడాలి. మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడిగా అంజలి నటిస్తుంది. థమన్ మ్యూజిక్.

Tags :

Advertisement