Advertisement

  • ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ ...రామరాజు ఫర్ భీంకు ముహూర్తం ఖరారు

ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ ...రామరాజు ఫర్ భీంకు ముహూర్తం ఖరారు

By: Sankar Tue, 20 Oct 2020 2:13 PM

ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్ ...రామరాజు ఫర్ భీంకు ముహూర్తం ఖరారు


ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 75 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా నటిస్తున్నారు. వీరిద్దరి వేరువేరు ప్రాంతాలు.. వేరు వేరు కాలాలు.

అయితే, ఈ సినిమాలో ఈ రెండు పాత్రలను ఎలా కలిపారు. ఎలా సినిమాను రన్ చేస్తున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా 'భీమ్ ఫర్ రామరాజు' అని అల్లూరిగా రామ్ చరణ్ టీజర్ ను విడుదల చేసాడు జక్కన్న అప్పటినుంచి ఎన్టీఆర్ టీజర్ కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మధ్యలో మహమ్మారి కరోనా అడ్డురాకుండా ఉంటే ఈపాటికి తారక్ టీజర్ అభిమానుల ముందుకు వచ్చేది.

ఇప్పడు ఈ టీజర్ కు ముహూర్తం ఖరారైంది, రామరాజు ఫర్ భీమ్ ను 22 న విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్ తాజాగా టైంను అనౌన్స్ చేశారు. మరో రెండు రోజుల్లో అంటే 22న ఉదయం11 గంటలకు ఈ వీడియోను విడుదల చేయనున్నారు. ఈ టీజర్ ను మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.

Tags :
|
|

Advertisement