Advertisement

రాజమౌళికి అలియాభట్ ఫోన్ చేసిందట

By: chandrasekar Tue, 23 June 2020 3:20 PM

రాజమౌళికి అలియాభట్ ఫోన్ చేసిందట


రాజమౌళి డైరెక్షన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ప్రాజెక్టు ఆర్ఆర్ ఆర్. లాక్ డౌన్ తర్వాత జూన్ రెండో వారంలో ప్రారంభం కావాల్సిన షూటింగ్ కు సంబంధించిన ప్రకటన జక్కన అండ్ టీం నుంచి రాలేదు.

మరోవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అలియాభట్ ఇంటికే పరిమితమైపోయింది. ఈ నేపథ్యంలో రాజమౌళికి అలియా భట్ ఫోన్ కాల్ చేసిందట. ముంబైలో చిక్కుకునిపోవడంతో షూటింగ్ లో పాల్గొనలేకపోవచ్చనే విషయాన్ని రాజమౌళి చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుంది. భవిష్యత్ లో షూటింగ్ షురూ అయి వాయిదా పడితే ఎలా ఉంటుంది ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటీ అనే విషయాలపై సమాలోచనలు చేసినట్లు ఫిలింనగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Tags :
|

Advertisement