Advertisement

  • అలియా ఆర్.ఆర్.ఆర్. చిత్రం నుండి తప్పుకోలేదని క్లారిటీ ఇచ్చింది

అలియా ఆర్.ఆర్.ఆర్. చిత్రం నుండి తప్పుకోలేదని క్లారిటీ ఇచ్చింది

By: chandrasekar Sat, 23 May 2020 12:11 PM

అలియా ఆర్.ఆర్.ఆర్. చిత్రం నుండి తప్పుకోలేదని క్లారిటీ ఇచ్చింది


దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా బాలీవుడ్ భామ అలియా, అజయ్ దేవగన్ తో పాటు హాలీవుడ్ ప్రముఖ నటి నటులు నటిస్తుండడం తో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఫై ఆసక్తి నెలకొని ఉంది. గత కొద్దీ రోజులుగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలలో జరిగిన షెడ్యూల్ పూర్తికావడంతో తరువాత షెడ్యూల్ మొదలయ్యే వరకు స్వల్ప విరామం ఇచ్చారు జక్కన్న.

ఈ నేపథ్యంలో ఈ మూవీ నుండి అలియా తప్పుకుందనే వార్త రెండు రోజులుగా సోషల్ మీడియా లో వైరల్ కావడం తో అంత షాక్ లో పడ్డారు. నిజంగానే చిత్రం నుండి తప్పుకుందా అని మాట్లాడుకోవడం స్టార్ట్ చేసారు. కానీ అలియా ఈ సినిమా నుండి తప్పుకోలేదని ఈరోజు రిలీజ్ అయినా ఫస్ట్ లుక్ తో తేలిపోయింది.ఉగాది కానుకగా ఈ చిత్ర టైటిల్ లోగో ను రిలీజ్ చేసారు చిత్ర యూనిట్. ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ విడుదల ప్రకటనని, ఆ తర్వాత కొద్దిసేపటికే విడువులైన మోషన్ పోస్టర్ ను అలియా తన ట్విట్టర్ లో పోస్ట్ చేయడం తో అలియా తప్పుకోలేదని పక్క గా క్లారిటీ వచ్చింది.

alia bhatt,rajamouli,rrr,deviate,clarity ,అలియా,  ఆర్ఆర్ఆర్, చిత్రం, నుండి తప్పుకోలేదని, క్లారిటీ ఇచ్చింది


ఎన్టీఆర్ కొమురం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న ఈ క్రేజీ ప్రాజెక్టుకి ‘రౌద్రం రణం రుధిరం’ పేరు ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో ఆసక్తి నింపారు. ‘జ‌లం అగ్నిని ఆర్పుతుంది. అదే అగ్ని జ‌లాన్ని ఆవిరి చేస్తుంది. ఈ రెండు బ‌లాలు క‌లిసి ఓ మ‌హాశ‌క్తిగా మీ ముందుకు వ‌స్తున్నాయి’..అంటూ రాజ‌మౌళి చెప్పుకొచ్చారు. ఇమోషన్ పోస్ట‌ర్‌లో ఎన్టీఆర్ ను జ‌లానికి, రామ్‌చ‌ర‌ణ్ ను అగ్నికి ప్ర‌తీక‌లా చూపించారు. ఆర్‌.ఆర్‌.ఆర్‌. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Tags :
|

Advertisement