Advertisement

  • రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ రానున్న అలియా భట్

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ రానున్న అలియా భట్

By: Sankar Wed, 28 Oct 2020 6:03 PM

రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ రానున్న అలియా భట్


యావత్ సినీ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్'.. దర్శకధీరుడు రాజమౌళి 'బాహుబలి' లాంటి సినిమా తర్వాత రెండేళ్ల విరామం తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందిస్తున్న సినిమా ఇది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

టైటిల్ లోగో మోషన్ పోస్టర్ తో అంచనాలు పెంచేసిన రాజమౌళి చరణ్ పుట్టినరోజు కానుకగా 'భీమ్ ఫర్ రామరాజు' వీడియోతో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి తీసుకెళ్లాడు. తాజాగా'రామరాజు ఫర్ భీమ్' వీడియోను రిలీజ్ చేసాడు జక్కన్న. ఎన్టీఆర్ అభిమానులు అంచనాలకు మించేలా టీజర్ ను డిజైన్ చేసాడు రాజమౌళి. దీంతో ఎన్టీఆర్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు ఈ మూవీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో అలియా భట్ కనిపించనుంది. ఇక చిత్రంలో చరణ్ సరసన సీత పాత్రలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ భామ అలియాభట్ ఇంతవరకు ఈ చిత్రం షూటింగులో పాల్గొనలేదు. దాంతో ఆర్ఆర్ఆర్ లో అలియా ఎంట్రీ పై రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా సమాచారం ప్రకారం ఈ అమ్మడు త్వరలో హైదరాబాద్ లో అడుగు పెట్టనుందట. ముందుగా ఈ సీన్స్ ని పూణే లొకేషన్స్ లో షూట్ చేయడానికి ప్లాన్స్ చేసుకున్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ప్లాన్ మారిపోయింది. ఇటీవలే హైదరాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఆలియా నవంబర్ ఫస్ట్ వీక్ లో హైదరాబాద్ కి వచ్చి 'ఆర్.ఆర్.ఆర్' టీమ్ తో జాయిన్ అవుతుందని సమాచారం. అలియా భట్ 'ఆర్.ఆర్.ఆర్' తో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'గంగూబాయ్' సినిమాలో నటిస్తోంది.

Tags :
|

Advertisement