Advertisement

  • దీపావళి కానుకగా నవంబర్ 9 న థియేటర్లలో విడుదల కానున్న అక్షయ్ కుమార్ లక్ష్మి బాంబ్ సినిమా

దీపావళి కానుకగా నవంబర్ 9 న థియేటర్లలో విడుదల కానున్న అక్షయ్ కుమార్ లక్ష్మి బాంబ్ సినిమా

By: Sankar Wed, 30 Sept 2020 5:49 PM

దీపావళి కానుకగా నవంబర్ 9 న థియేటర్లలో విడుదల కానున్న అక్షయ్ కుమార్ లక్ష్మి బాంబ్ సినిమా


బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకడు అక్షయ్ కుమార్ ..అయితే అందరు స్టార్ హీరోలలా కాకుండా ఏడాదికి మినిమం అయిదు సినిమాలైనా అక్షయ్ రిలీజ్ చేస్తుంటారు..అయితే కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో అక్షయ్ సినిమాలకు బ్రేక్ పడింది..సౌత్ లో మంచి విజయం సాధించిన 'కాంచన' సినిమాను బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే.

'లక్ష్మి బాంబ్' పేరుతో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ వేగంగా ఇటీవలే పూర్తయ్యింది. లక్ష్మి బాంబ్ లో అక్షయ్ కుమార్ లేడీ గెటప్ కు సంబంధించిన ఫోటోను ఆ మధ్య రిలీజ్ చేశారు. పాత్రకు తగ్గట్టుగా అక్షయ్ కుమార్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇక ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయనున్నట్టు ఆమధ్య ప్రకటించారు. కానీ ఆనిర్ణయాన్ని మార్చుకున్నారు.

ఇప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది, కానీ మనదగ్గర కాదు ఆస్ట్రేలియా , న్యూజిలాండ్ , యుఎస్ఏ లో దీపావళి కానుకగా నవంబర్ 9న లక్ష్మీబాంబ్ విడుదల కానుంది.ఇందుకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఇండియా థియేటర్స్ ఓపెన్ అయ్యిన వెంటనే ఇక్కడ కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Tags :

Advertisement