Advertisement

  • అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న సినిమా యాక్టర్లలో ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచిన అక్షయ్ కుమార్

అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న సినిమా యాక్టర్లలో ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచిన అక్షయ్ కుమార్

By: Sankar Wed, 12 Aug 2020 7:11 PM

అత్యధిక ఆదాయం సంపాదిస్తున్న సినిమా యాక్టర్లలో ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచిన అక్షయ్ కుమార్


బాలీవుడ్‌ స్టార్‌ హీరో అరుదైన రికార్డును సృష్టించాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న సినిమా యాక్టర్ల జాబితాలో అక్షయ్‌కుమార్‌ ఛాన్స్‌ కొట్టేశాడు. అక్షయ్‌కుమార్‌ 2019 జూన్‌ 2020 జూన్‌ మధ్య రూ.362 కోట్లు (48.5 మిలియన్‌ డాలర్లు) సంపాదనతో.. పోర్బ్స్‌ టాప్‌-10 జాబితాలో అక్షయ్‌కుమార్‌ 6వ స్థానంలో నిలిచాడు.

భారత్‌ నుంచి అక్షయ్‌ ఒక్కడే ఈ లిస్ట్‌లో చోటు సంపాదించడం విశేషం. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో డ్వానే జాన్సన్‌ టాప్‌ 1స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రెండో స్థానంలో ర్యాన్‌ రేనాల్డ్స్‌, మార్క్‌ వాల్‌ బెర్గ్‌, బెన్‌ అఫ్లెక్‌, విన్‌ డీజిల్‌, అక్షయ్‌కుమార్‌, లిన్‌-మాన్యుయల్‌ మిరండా, విల్‌స్మిత్‌, అడమ్‌ సాండ్లర్‌, జాకీ చాన్‌.

గతేడాది అక్షయ్‌కుమార్‌ మిషన్‌ మంగళ్‌, హౌస్‌ఫుల్‌ 4, గుడ్‌న్యూస్‌ చిత్రాలతో బాక్సాపీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాడు అక్షయ్‌కుమార్‌. సినిమాతో పలు జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులను కూడా ప్రమోట్‌ చేస్తున్నాడు అక్షయ్‌కుమార్‌. కాగా ఇంత బారి మొత్తం లో సంపాదిస్తున్న అక్షయ్ సేవ కార్యక్రమాలలో కూడా అంతే స్థాయిలో పాల్గొంటున్నాడు ..కరోనా మహమ్మారి నిర్ములనకు 30 కోట్లు విరాళంగా ఇచ్చాడు.



Tags :
|
|

Advertisement