Advertisement

  • Breaking: తెలంగాణ సీయం సహాయనిధికి నాగార్జున భారీ విరాళం..!

Breaking: తెలంగాణ సీయం సహాయనిధికి నాగార్జున భారీ విరాళం..!

By: Anji Tue, 20 Oct 2020 2:57 PM

Breaking: తెలంగాణ సీయం సహాయనిధికి నాగార్జున భారీ విరాళం..!

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు భాగ్య నగర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వర్షాల వల్ల హైదరాబాద్ లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది.

550 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అందుకుగాను తెలంగాణ ప్రభుత్వాన్ని కింగ్ అక్కినేని నాగార్జున అభినందించారు. అంతే కాదు... తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి 50 లక్షల రూపాయలు విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.

కరోనా విపత్తు సంభవించిన సమయంలోనూ చిత్ర పరిశ్రమలో కార్మికులను ఆదుకోవడానికి ఏర్పాటైన కరోనా క్రైసిస్ చారిటీ (సిసిసి)కి నాగార్జున భారీ మొత్తంలో విరాళం అందించారు.

ఇప్పుడు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. నాగార్జున స్పూర్తితో మరింత మంది ప్రముఖులు విరాళాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

Tags :

Advertisement