Advertisement

  • ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' ప్రీ టీజర్‌ విడుదల... ఎప్పుడో తెలుసా...!

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' ప్రీ టీజర్‌ విడుదల... ఎప్పుడో తెలుసా...!

By: Anji Sun, 18 Oct 2020 05:48 AM

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' ప్రీ టీజర్‌ విడుదల... ఎప్పుడో తెలుసా...!

అఖిల్ – బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో అఖిల్ నాల్గో సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ని గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

రీసెంట్ గా సినిమా షూటింగ్ మొదలు పెట్టింది. రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ చేస్తున్నారు.ఇప్పటి వరకు అఖిల్‌ చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్‌ సాధించకపోవడంతో.. ఈ చిత్రంపై అక్కినేని ఫ్యామిలీతో పాటు అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకున్నారు.

ఇక ఈ చిత్ర ప్రీ టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ ప్రకటించింది. అభిమానులనుం వస్తున్న ఒత్తిడి కారణంగా.. ఈ చిత్ర ప్రీ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లుగా చెబుతూ.. నెట్‌లో అభిమానులు ఈ సినిమా కోసం ఏ విధంగా సెర్చ్‌ చేస్తున్నారో తెలిపే పోస్టర్స్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది. అభిమానుల కోరిక మేరకు ఈ చిత్ర ప్రీ టీజర్‌ను 19 అక్టోబర్‌, ఉదయం 9 గంటల 39 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ తెలిపింది.

Tags :

Advertisement