Advertisement

  • నేను చెప్పిన విధంగా చేస్తే చెన్నైలో కరోనాను అరికట్టవచ్చు ..స్టార్ హీరో అజిత్

నేను చెప్పిన విధంగా చేస్తే చెన్నైలో కరోనాను అరికట్టవచ్చు ..స్టార్ హీరో అజిత్

By: Sankar Sun, 28 June 2020 6:03 PM

నేను చెప్పిన విధంగా చేస్తే చెన్నైలో కరోనాను అరికట్టవచ్చు ..స్టార్ హీరో అజిత్



తమిళనాడులో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి ..ముంబై , ఢిల్లీ తర్వాత తమిళనాడు లోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి ..ముఖ్యంగా చెన్నై కరోనా దాటికి కుదేలు అవుతుంది ..కరోనా దెబ్బకు తిరిగి చెన్నైలో లాక్ డౌన్ విధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ..అయితే చెన్నైలో కరోనా తీవ్రతను అడ్డుకునేందుకు ఒక సలహా ఇచ్చాడు తమిళ స్టార్ హీరో అజిత్..

కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు డ్రోన్ల ద్వారా క్రిమినాశని పిచికారీ చేయాలని తమిళ సినీనటుడు అజిత్‌ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. చెన్నై నగరం కరోనా రెడ్‌జోన్‌గా మారుతుండటం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా తాకిడి ప్రాంతాల్లో ముమ్మరంగా క్రిమినాశని పిచికారీ చేస్తే ఆ వైరస్‌ వ్యాప్తిని నిరోధించవచ్చునని అభిప్రాయపడ్డారు. అజిత్‌ నేతృత్వంలో ఐఐటీ మద్రాసులోని ‘తక్ష’ అనే బృందం నవీన సాంకేతిక పద్ధతులతో డ్రోన్లను రూపొందిస్తోంది.

జాతీయస్థాయిలో ఆ డ్రోన్లు పలు పోటీల్లో పాల్గొని బహుమతులు కూడా గెలుచుకున్నాయి. ఆస్ర్టేలియాలోనూ అజిత్‌ బృందం తయారు చేసిన డ్రోన్ల సామర్థ్యానికి బహుమతులు లభించాయి. ఈ సందర్భంగా అజిత్‌ మాట్లాడుతూ... తాము రూపొందించిన డ్రోన్ల ద్వారా అరగంటలో 16లీటర్ల క్రిమినాశనిని పిచికారీ చేయవచ్చునని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశుధ్య కార్మికులకు బదులుగా తమ బృందం రూపొందించిన డ్రోన్లతో క్రిమినాశని చల్లితే కరోనాను కట్టడి చేయవచ్చునని తెలిపారు. అజిత్‌ చెప్పిన ఈ సలహా పట్ల ఆయన అభిమానులు హర్షం ప్రకటించారు.

Tags :
|
|

Advertisement