Advertisement

ఒసేయ్ రాములమ్మ -2 పేరుతో కొత్త సినిమా

By: Sankar Wed, 22 July 2020 09:38 AM

ఒసేయ్ రాములమ్మ -2 పేరుతో కొత్త సినిమా



లేడీ సూపర్ స్టార్ విజయశాంతి , దర్శక రత్న దాసరి నారాయణరావు కంబినేషన్లో వచ్చిన ఒసేయ్ రాములమ్మ ఎంత అద్భుత విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే ..అప్పటిదాకా ఉన్న రికార్డులు అన్నిటిని ఈ సినిమా బద్దలు కొట్టింది..విజయశాంతి తన అసమాన నటన ప్రతిభతో సినిమాను మరోక స్థాయికి తీసుకెళ్లింది ...1997 లో విడుదల అయినా ఈ సినిమా గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నం అంటే ..ఒసేయ్ రాములమ్మ -2 పేరుతో కొత్త సినిమా వస్తుంది..

కౌండిన్య ఫిలిం ఫ్యాక్టరీ సమర్పణలో కనకదుర్గ ఫిలింస్‌ పతాకంపై అజయ్‌ కౌండిన్య స్వీయ దర్శకత్వంలో ‘ఒసేయ్‌ రాములమ్మా 2’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాత అజయ్‌ కౌండిన్య మాట్లాడుతూ– ‘‘అద్భుతమైన కథ కథనంతో ‘ఒసేయ్‌ రాములమ్మా 2’ స్క్రిప్ట్‌ సిద్ధం అవుతోంది. నా కథకి ఈ టైటిల్‌ బాగా సరిపోతుంది. కథ, కథనం పర్ఫెక్ట్‌గా కుదరడంతో మంచి నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసుకుంటున్నా. అతి త్వరలో షూటింగ్‌ మొదలుపెడతాం’’ అన్నారు.

కాగా తెలుగు ఇండస్ట్రీలో సీక్వెల్ సినిమాలు అంతగా కలిసి రాలేదు ..మరి అల్ టైం సూపర్ హిట్ సినిమాలలో ఒకటి అయిన ఒసేయ్ రాములమ్మ సీక్వెల్ పేరుతో వస్తున్న ఈ ఒసేయ్ రాములమ్మ -2 ఎంతటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి మరి ..


Tags :
|

Advertisement