Advertisement

  • మీరు 'నా ప్రాణం' బాబు ..వైరల్ అవుతున్న బండ్ల గణేష్ వ్యాఖ్యలు

మీరు 'నా ప్రాణం' బాబు ..వైరల్ అవుతున్న బండ్ల గణేష్ వ్యాఖ్యలు

By: Sankar Wed, 15 July 2020 3:16 PM

మీరు 'నా ప్రాణం' బాబు ..వైరల్ అవుతున్న బండ్ల గణేష్ వ్యాఖ్యలు



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అభిమానంతో మేము మాత్రం బ్రేక్ ఇవ్వం అంటూ అయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నారు..సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ బర్త్డే కానీ అయన అభిమానులు మాత్రం 50 రోజులు ముందుగానే అయన బర్త్డే సెలెబ్రేషన్స్ మొదలు పెట్టారు సోషల్ మీడియాలో ..ఎంతలా అంటే ప్రస్తుతం ఇండియాలో ట్రెండ్ అవుతున్న వాటిలో పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఒకటి..ఈ ట్రెండ్ ప్రారంభించిన 24 గంటల్లోనే పవన్ కళ్యాణ్‌కి అడ్వాన్స్ బర్త్ డే విషెష్ అందిస్తూ.. 27.3 మిలియన్లు ట్వీట్స్ రావడం విశేషం.

ఇప్పటి పవన్ కళ్యాణ్‌కు అడ్వాన్స్ బర్త్ డే విషెష్ హోరెత్తుతుండగా.. ఆయన భక్తుడు, గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ తనదైన శైలిలో ట్వీట్ వదిలాడు. ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తినా మీతో ఉండాలని ఆశ అంటూ గబ్బర్ సింగ్ ఆడియో వేడుకలో బండ్ల గణేష్ చూపిన భక్తిని మరోసారి పవన్ అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్ సందర్భంగా ట్వీటారు బండ్ల గణేష్.

పవన్ కళ్యాణ్ అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్స్‌లో భాగంగా.. బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన మాటలను జగదీష్ అనే అభిమాని బండ్ల గణేష్‌ని ట్యాగ్ చేసి వదలడంతో ఈ వీడియోను రీ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. ‘ఎప్పటికీ ఎన్ని జన్మలెత్తినా మీతో ఉండాలని ఆశ.. మీరు దగ్గర ఉంటే ముద్దు పెట్టుకోవాలనిస్తుంది.. మీరు నా ప్రాణం.. బాబూ అందరి ఆశీస్సులు తీసుకుని మీరు చల్లగా ఉండాలి’ అంటూ బండ్ల గణేష్ కన్నీళ్లు పెట్టుకున్న ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Tags :
|

Advertisement