Advertisement

  • నేపోటిజంపై కామెంట్స్ చేసిన హార్ట్ ఎటాక్ బ్యూటీ

నేపోటిజంపై కామెంట్స్ చేసిన హార్ట్ ఎటాక్ బ్యూటీ

By: Sankar Tue, 15 Sept 2020 11:51 AM

నేపోటిజంపై కామెంట్స్ చేసిన హార్ట్ ఎటాక్ బ్యూటీ


తెలుగు ప్రేక్షకులకు నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో పరిచయం అయిన బ్యూటీ అదాశర్మ. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇక్కడ కొన్ని సినిమాలు చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ..హాట్ హాట్ ఫోటో లు పోస్ట్ చేస్తూ..సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.

ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తుంది ఈ చిన్నది. ప్రస్తుతం ఈ బ్యూటీ హైదరాబాద్ లో ఉంటుంది. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ నెపోటిజం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `నేను కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి అంతా నన్ను ఇదే ప్రశ్న అడుగుతున్నారు.

దానికి నేను మనలో టాలెంట్ వుంటే ఖచ్చితంగా పైకి వస్తారు అని సమాధానం చెప్పేదాన్ని .. కానీ మనసులో మాత్రం ఎంత టాలెంట్ వున్నా సరైన అవకాశం దొరకనప్పుడు ప్రతిభకు గుర్తింపు రాదు కదా ?అని నేను మనసులో అనుకుండేదాన్ని. అయినా పాజిటివ్ గా ఉండటం , అందరిని నవ్వించచడం నేర్చుకున్నా అని చెప్పుకొచ్చింది. అవకాశాలు రాలేదా ఓకే లీవిట్ అనుకుంటూ .. ముందుకు సాగడం నేర్చుకున్నాను. ఏం జరుగుతుందో చూడాలని నిర్ణయించుకున్నాను.

Tags :

Advertisement