Advertisement

  • Shocking News: అల్లు అర్జున్ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన హీరోయిన్...!

Shocking News: అల్లు అర్జున్ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన హీరోయిన్...!

By: Anji Fri, 25 Dec 2020 5:07 PM

Shocking News: అల్లు అర్జున్ గురించి సంచలన విషయాలు బయటపెట్టిన హీరోయిన్...!

కోడి రామకృష్ణ తెరకెక్కించిన దేవి సినిమాలో నటించిన వనితా విజయ్ కుమార్..నిత్యం వివాదాల్లో ఉంటూ హాట్ టాపిక్ అవుతుంటుంది.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ తనకు లైన్ వేసాడని చెప్పి పెద్ద షాక్ ఇచ్చింది.

చెన్నైలో తెలుగు పరిశ్రమ ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో తమకు చాలా మంచి అనుబంధం ఉండేదని, వాళ్ళింట్లో ఇంట్లో జరిగే ముఖ్యమైన ఫంక్షన్లకు తమ ఫ్యామిలీ మొత్తం వెళ్లే వాళ్లమని చెప్పుకొచ్చింది వనితా విజయ్ కుమార్.

కాగా, అదే టైమ్‌లో చిరంజీవి నటించిన ఓ ఇంగ్లీష్ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్‌కి తాను వెళ్లగా.. అక్కడే ఉన్న అల్లు అర్జున్ తన వైపు చూస్తూ లైన్ వేశాడని తెలిపి ఆశ్చర్యపరిచింది. అయితే ఆ సమయంలో అల్లు అర్జున్ తనకంటే చిన్నవాడిని, ఆయన వయసు 14 సంవత్సరాలు ఉండొచ్చని చెప్పుకొచ్చింది వనితా విజయ్ కుమార్.

కానీ అప్పుడు అతను బన్నీ అని గుర్తించని తనకు.. కొన్ని రోజుల తర్వాత ఆ విషయం అర్థమైందని తెలిపింది. అది జరిగాక చాలా రోజులకు ఆ ఫంక్షన్‌లో తాను వేసుకున్న మ్యాంగో కలర్ డ్రెస్‌ గురించి బన్నీ ఓ ఫోన్ కాల్‌లో ప్రస్తావించడంతో అప్పుడు ఆ కుర్రాడు బన్నీ అని తెలిసిందంటూ ఓపెన్ కామెంట్స్ చేసింది.

అదేవిధంగా టాలీవుడ్‌లో బన్నీ సూపర్ డాన్సర్ అని చెప్పిన వనితా విజయ్ కుమార్.. ఛాన్స్ దొరికితే ఆయనతో కలిసి నటిస్తానని మనసులో మాట చెప్పింది. అల్లు అర్జున్‌కు అత్తగా నటించాలని ఉందని తెలిపింది.

Tags :

Advertisement