Advertisement

కరోనా నుంచి కోలుకున్న మిల్కీ బ్యూటీ...!

By: Anji Tue, 06 Oct 2020 08:58 AM

కరోనా నుంచి కోలుకున్న మిల్కీ బ్యూటీ...!

మిల్కీ బ్యూటీ తమన్నా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కరోనా లక్షణాలు కనిపించడం తో వెంటనే ఆమె కరోనా టెస్ట్ చేయించుకుంది. అయితే ఆ టెస్ట్ లో పాజిటివ్ రావడం తో హాస్పటల్ లో చేరి చికిత్స తీసుకుంది.

ప్రస్తుతం ఆమె హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయ్యింది. జ్వరం తగ్గడం.. ఇతర లక్షణాలు తగ్గిపోవడంతో వైద్యులు తమన్నాను ఈరోజు డిశ్చార్జ్ చేశారు. ఈ విషయాన్ని తమన్నానే స్వయంగా సోషల్ మీడియాలో తెలిపింది.

హోం ఐసోలేషన్ ఉండి చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచించారని.. మందులు తీసుకుంటూ ఇంట్లోనే కరోనాకు చికిత్స తీసుకుంటానని తమన్నా తెలిపింది.

Tags :
|
|

Advertisement