Advertisement

  • ఇప్పుడు ఆ స్టార్ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా...?

ఇప్పుడు ఆ స్టార్ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా...?

By: Anji Sat, 12 Dec 2020 4:44 PM

ఇప్పుడు ఆ స్టార్ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా...?

సీతాకోక చిలుక చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయింది షీలా కౌర్. ఆ తర్వాత టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పరుగు సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కావడంతో.. వరుసగా కన్నడ, మలయాళం, తమిళం, హిందీ, తదితర భాషలలో సినిమా అవకాశాలను దక్కించుకుంది షీలా.

ఈ క్రమంలో మస్కా, అదుర్స్, పరమవీర చక్ర, తదితర చిత్రాలలో నటించింది. ఈ నేపథ్యంలో వైవాహిక జీవితంపై దృష్టి సారించింది.దీంతో సినిమా పరిశ్రమకు చెందిన “సంతోష్ రెడ్డి” అనే వ్యక్తిని ప్రేమించి రహస్యంగా పెళ్లి చేసుకుంది.

పెళ్లయిన తర్వాత షీలా కౌర్ మళ్లీ సినిమాలలో నటించలేదు. చివరగా కన్నడలో 2018వ సంవత్సరంలో “హైపర్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం షీలా కౌర్ చేతిలో ఎలాంటి సినిమా అవకాశాలు లేవు.

ఈ అమ్మడు సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యాపార రంగంలో రాణించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Tags :
|

Advertisement