Advertisement

  • డ్రగ్స్ కేసులో రకుల్ కు సారీ చెప్పిన సమంత

డ్రగ్స్ కేసులో రకుల్ కు సారీ చెప్పిన సమంత

By: Sankar Mon, 14 Sept 2020 4:55 PM

డ్రగ్స్ కేసులో రకుల్ కు సారీ చెప్పిన సమంత


టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అలాగే సారా అలీఖాన్ కు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పింది. అయితే బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం సంచలనాలకు తెరలేపుతుంది. ఇప్పటికే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

రియాను ఎన్సీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విచారణలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు బయటకు వస్తున్నాయి ఊహించని విధంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు అలాగే సారా అలీఖాన్ పేరుకూడా రియా బయటపెటినట్టు వార్తలు వచ్చాయి. దాంతో నెటిజన్లు వారిని ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. తాజాగా ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ.. మేము ఇంకా డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటులతో జాబితాను సిద్ధం చేయలేదని కేవలం డ్రగ్స్ సరఫరా చేసేవారిని గుర్తించం అని తెలిపారు.

అయితే రియా రకుల్, సారాల పేరు చెప్పింది నిజమేనా అని ప్రశ్నించగా... లేదు అసలు మేము ఇంకా ఎవరి జాబితాను సిద్ధం చేయలేదు మల్హోత్రా అన్నారు. దాంతో సోషల్ మీడియాలో రకుల్, సారాలను కామెంట్స్ చేస్తూ ట్రోల్స్ చేసిన వారు ఇప్పుడు వారికి సారీ చెప్తూ పోస్ట్ చేస్తున్నారు. అదే విధంగా సమంత కూడా రకుల్, సారాలకు క్షమాపణలు చెప్తూ పోస్ట్ చేసింది. అంటే సమంత కూడా ముందుగా వారిని దోషులు అనే అనుకున్నట్లు తెలిస్తుంది.

Tags :
|

Advertisement