Advertisement

  • ప్రియుడు కోసం 25 లక్షలు ఖర్చు చేసిన స్టార్ హీరోయిన్...!

ప్రియుడు కోసం 25 లక్షలు ఖర్చు చేసిన స్టార్ హీరోయిన్...!

By: Anji Sat, 26 Sept 2020 7:31 PM

ప్రియుడు కోసం 25 లక్షలు ఖర్చు చేసిన స్టార్ హీరోయిన్...!

నటి నయనతారకు గతంలో తన ప్రేమ జీవితంలో చాలా చెడ్డ అనుభవాలు ఉన్నాయి. శింబు, ప్రభుదేవా వంటి వారితో ఆమె డేటింగ్ చేసి ఆ తరువాత వారితో విడిపోవడాన్ని మేము చూశాము.

ఆమె గత కొన్నేళ్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్‌ తో కలిసి ఉంటుంది. నయన్, విఘ్నేష్ నాలుగేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. కెరీర్‌లో అనుకున్నవి సాధించాకనే పెళ్లి చేసుకుంటామని ఇటీవల విఘ్నేష్ వెల్లడించాడు. ఈ జంట తరచుగా తమ హాలిడే కోసమంటూ అనేక దేశాలు చుట్టివస్తూ ఉంటారు.

అయితే కరోనా కారణంగా ఈ సారి అది కుదరకపోవడంతో గోవా తో సరిపెట్టుకుంది ఈ జంట. నయనతార ఇటీవలే గోవాలో విఘ్నేష్ పుట్టినరోజు జరిపింది. వారి మూడు రోజుల పర్యటన కోసం ఆమె 25 లక్షలు ఖర్చు చేసినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ విషయం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇలా ప్రియుడి కోసమంటూ డబ్బులు వెదజల్లుతుంది ఈ స్టార్ హీరోయిన్.

Tags :

Advertisement