Advertisement

  • Flash News: కాజల్‌ పెళ్లికి వెళ్లనున్న టాలీవుడ్ స్టార్ హీరో...!

Flash News: కాజల్‌ పెళ్లికి వెళ్లనున్న టాలీవుడ్ స్టార్ హీరో...!

By: Anji Tue, 20 Oct 2020 1:26 PM

Flash News: కాజల్‌ పెళ్లికి వెళ్లనున్న టాలీవుడ్ స్టార్ హీరో...!

టాలీవుడ్ చందమామ కాజల్‌ ఒక ఇంటిది అవుతున్నారు. ముంబయికి చెందిన ఇంటీరియర్ డిజైనర్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లును ఈ నెల 30న కాజల్ వివాహం చేసుకోబోతున్నారు. కాజల్ ఇంట్లోనే ఈ శుభాకార్యం జరగబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే కరోనా నేపథ్యంలో ఈ పెళ్లిని సింపుల్‌గా చేసుకుంటున్నారట కాజల్‌. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మినహా ఎవ్వరినీ పిలవకూడదని వారు అనుకుంటున్నారట. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం 40 నుంచి 50 మంది ఈ పెళ్లికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

actress kajal agarwal marriage on 30th october in her house,bellamkonda srinivas kajal,bellamkonda to attend kajal marriage,gautam kitchlu,kajal aggarwal,kajal aggarwal marriage,kajal aggarwal marriage news,kajal marriage,kajal weds gautam

కాగా ఈ లిస్ట్‌లో టాలీవుడ్‌ యంగ్ హీరో, కాజల్‌ బెస్ట్‌ ఫ్రెండ్ బెల్లంకొండ శ్రీనివాస్ ఉన్నట్లు తెలుస్తోంది. సీత, కవచం చిత్రాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. ఈ నేపథ్యంలో సీక్రెట్‌గా జరిగిన కాజల్‌ ఎంగేజ్‌మెంట్‌కి బెల్లంకొండ వెళ్లినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే ఆ ఫొటోలేవీ బయటకు రాకపోవడంతో అందులో నిజమెంతో తెలీలేదు. ఇక ఇప్పుడు బెల్లంకొండ, కాజల్‌ పెళ్లికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. కాగా పెళ్లైన తరువాత కూడా హీరోయిన్‌గా తన కెరీర్‌ని కొనసాగిస్తానంటూ కాజల్ వెల్లడించిన విషయం తెలిసిందే.

Tags :

Advertisement