Advertisement

అరణ్య మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన రానా ..

By: Sankar Wed, 21 Oct 2020 5:13 PM

అరణ్య మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన రానా ..


దగ్గుపాటి వారసుడు , టాలీవుడ్ భల్లాలదేవ హీరోగా నటించిన చిత్రం అరణ్య ...హిందీలో హాథీ మేరీ సాథీగా తెరకెక్కిస్తున్నారు ..హిందీ , తెలుగు లోనే కాకుండా తమిళ భాషలో కూడా ఈ సినిమా విడుదల కానుంది..అయితే ఈ సినిమా రిలీజ్ ఉత్కంఠకు తెరపడింది .. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు హీరో రానా స్వయంగా వెల్లడించారు..

ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తుండగా.. రానా, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ ప్రధాన పాత్రధారులు పోషిస్తున్నారు. ఈ చిత్రం పర్యావరణ ఇతివృత్తంతో రూపొందినట్టు తెలుస్తోంది. 25 సంవ‌త్స‌రాలుగా అర‌ణ్యంలో జీవిస్తున్న ఒక మ‌నిషి క‌థ ‘అరణ్య‌’. ఈ చిత్రం ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌స్య‌లు, అట‌వీ నిర్మూల‌న సంక్షోభంపై దృష్టి పెడుతోంది.

మానవుల స్వార్థం కోసం అడవుల ఆక్రమ‌ణ‌, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వ‌ల్ల ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా అరణ్య తెరకెక్కింది.

ఇందులో రానా పాత్రకు సంబంధించిన లుక్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో చిత్రంపై మొదటి నుంచి అభిమానుల్లో ఆసక్తి కలుగుతోంది. మొత్తానికి వచ్చే సంక్రాంతి బరిలో రానా ఓ సందేశాత్మక చిత్రంతో రానున్నాడు. కాగా, సంక్రాంతికి పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' సినిమా కూడా విడుదల కానున్నట్టు తెలుస్తోంది.

Tags :
|
|

Advertisement