Advertisement

  • నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన నటుడు నారా రోహిత్

నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన నటుడు నారా రోహిత్

By: chandrasekar Mon, 31 Aug 2020 3:28 PM

నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపిన నటుడు నారా రోహిత్


నటసింహం బాలకృష్ణ నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఆ పేరు నిలబెట్టిన నటుడు. తెలుగు చిత్రసీమకు ఆయన పరిచయమై 46 ఏళ్లు పూర్తిచేసుకుంటున్నారు.

ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తున్న బాలయ్య, అటు సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. తాతమ్మ కల సినిమాతో వెండితెరకు పరిచయమై తొలి సినిమాలోనే కీలకపాత్ర పోషించారు.

తండ్రిలాగే డైలాగ్స్‌కు పెట్టింది పేరు. నందమూరి అభిమానులను, టాలీవుడ్ ప్రేక్షకులను పౌరాణిక, జానపద పాత్రల్లోనూ జీవించి మెప్పించారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నటుడు నారా రోహిత్. నందమూరి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. 'జై బాలయ్య !! జై జై బాలయ్య' అంటూ పోస్ట్ చేయడం ముఖ్య విషయం.

Tags :
|

Advertisement