Advertisement

  • బిగ్ బాస్ హౌస్ లో ఆ కంటెస్టెంట్ కి వాయిస్ ఇచ్చిన యాక్టర్ నందు..

బిగ్ బాస్ హౌస్ లో ఆ కంటెస్టెంట్ కి వాయిస్ ఇచ్చిన యాక్టర్ నందు..

By: Sankar Sun, 20 Sept 2020 5:08 PM

బిగ్ బాస్ హౌస్ లో ఆ కంటెస్టెంట్ కి వాయిస్ ఇచ్చిన యాక్టర్ నందు..


బిగ్ బాస్ సీజన్ ౪ మొదట్లో డల్ గా ఉన్న రోజులు పెరిగే కొద్దీ ఎంటర్టైన్మెంట్ కూడా పెరుగుతుంది..ఇప్పటికే ఇందులో నుంచి ఇద్దరు కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అవ్వగా మరొక కంటెస్టెంట్ ఎలిమినేషన్ కు సిద్ధంగా ఉన్నారు..కాగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కుమార్ సాయి , జబర్దస్త్ అవినాష్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే..

అయితే బిగ్ బాస్ ప్రారంభం అవకముందు నుంచి కూడా యాక్టర్ నందు బిగ్ బాస్ హౌస్లోకి వస్తున్నాడు అని వార్తలు వచ్చాయి..ఆ మధ్య నందు కూడా బీబీ అంటూ పోస్టులూ పెడుతూ న‌టుడు నందు ర‌చ్చ ర‌చ్చ చేశాడు. దీంతో అత‌డు బిగ్‌బాస్‌లో అడుగు పెట్ట‌బోతున్నాడ‌ని అంతా అనుకున్నారు. కానీ అంద‌రి ఊహాగానాల‌ను చిన్నాభిన్నం చేస్తూ బీబీ అంటే "బొమ్మ బ్లాక్‌బ‌స్ట‌ర్" అని త‌న త‌ర్వాతి సినిమా టైటిల్‌ను వెల్ల‌డించాడు. దీంతో అత‌డు బిగ్‌బాస్‌లోకి వెళ్తున్నాడ‌నుకున్న అభిమానులు నిరుత్సాహ‌ప‌డ్డారు. కానీ బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో నందు వినిపించాడు.

అతడు రాక‌పోయినా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన‌ ముక్కు అవినాష్ ఏవీకి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడు. అవినాష్ లైఫ్ జ‌ర్నీకి సంబంధించిన ఈ ప్రోమోలో అత‌డు బాల్యం నుంచి య‌వ్వ‌నం వ‌ర‌కు ప‌డ్డ‌ క‌ష్టన‌ష్టాల‌ను గురించి వివ‌రంగా చెప్పుకొచ్చాడు. ఈ విష‌యాన్ని నందు ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియ‌జేశాడు. "నేను చాలా ఇష్ట‌ప‌డే డైరెక్ట‌ర్‌, నా స్నేహితుడు అవినాష్ కోసం వాయిస్ ఓవ‌ర్ చెప్పాను. బీబీ, బీబీ అని చెప్పినందుకు చివ‌రికి ఇలానైనా నా వాయిస్ బిగ్‌బాస్‌లో వినప‌డినందుకు సంతోషం" అని తెలిపాడు.


Tags :

Advertisement