Advertisement

  • ప్రముఖ నటుడు కిక్ శ్యామ్ అరెస్ట్ ..ఎందుకో తెలుసా ..?

ప్రముఖ నటుడు కిక్ శ్యామ్ అరెస్ట్ ..ఎందుకో తెలుసా ..?

By: Sankar Tue, 28 July 2020 12:38 PM

ప్రముఖ నటుడు కిక్ శ్యామ్ అరెస్ట్ ..ఎందుకో తెలుసా ..?



ప్రముఖ సినీ నటుడు కిక్ సినిమా ఫేమ్ అయిన శ్యామ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైలోని కోడంబాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతున్న శ్యామ్ గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పేకాట, బెట్టింగులు నిర్వహిస్తుండటంతో కేసు నమోదు చేశారు.

కిక్ శ్యామ్ గా ఫేమస్ అయిన ఈ నటుడికి చెన్నైలోని కోడంబాక్కం ప్రాంతంలో ఓ పోకర్ క్లబ్ ఉంది. అనుమతి లేకుండా ఇక్కడ గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దాడులు చేశారు. దీంతో పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. నుంగంబాక్కంలో నివసిస్తున్న శ్యామ్ లాక్ డౌన్ నేపథ్యంలో తన నివాసంలోనే గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన శ్యామ్ మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో కిక్, ఊసరవెల్లి ,రేసుగుర్రం, కిక్- 2 వంటి చిత్రాలలో నటించాడు శ్యామ్. ఎక్కువగా దర్శకుడు సురేంద్ర రెడ్డి సినిమాల్లో కనిపించాడు. కిక్ సినిమాలో అతడు మంచి పాత్ర వేయడంతో తెలుగు జనాల్లో కిక్ శ్యామ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు

Tags :
|
|

Advertisement