Advertisement

చెన్నైలో నటుడు అరవ్ పెళ్లి వేడుకలు

By: chandrasekar Mon, 07 Sept 2020 09:55 AM

చెన్నైలో నటుడు అరవ్ పెళ్లి వేడుకలు


బిగ్‌బాస్‌ రియాల్టీ గేమ్‌ షో మొదటి సీజన్‌లో పాల్గొని విన్నర్‌గా నిలవడంతోపాటు, బిగ్‌బాస్‌లో చర్చనీయాంశ సభ్యుడిగా వార్తల్లోకి ఎక్కాడు అరవ్‌. ఇతనికి ఆ హౌస్‌లో పాల్గొన్న నటి ఓవియ మధ్య ప్రేమాయణం పెద్ద వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత కూడా వీరిద్దరి గురించి ప్రేమ వదంతులు వచ్చాయి. అయితే వాటిని అరవ్, నటి ఓవియా ఖండించారు. అరవ్‌కు నటి రాహీకు మధ్య చాలా కాలంగా ప్రేమాయణం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. అరవ్‌ నటి రాహీ అనూహ్యంగా ఆదివారం ఉదయం పెళ్లి పీటలు ఎక్కారు.

చెన్నైలో జరిగిన వీరి పెళ్లి వేడుకకు దర్శకుడు కేఎస్‌ రవికుమార్, నటి సుజా వరూణీ, గణేష్‌ ఆర్తి దంపతులు, నిర్మాత సురభి మోహన్, దర్శకుడు సతీష్, గాయత్రి రఘురాం, నటుడు శివ, గీత రచయిత స్నేహన్, నటుడు గణేష్‌ వెంకట్రామన్, దర్శకుడు విజయ్, నటి బిందుమాధవి, నటుడు హరీష్‌ కల్యాణ్‌ విచ్చేసి నవ దంపతులకు ఆశీర్వదించారు.

Tags :
|
|

Advertisement