Advertisement

  • అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు

అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు

By: Sankar Wed, 20 May 2020 4:07 PM

అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు


పుష్ప’ సినిమా స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ – అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో అందరి కళ్ళు ఇప్పుడు ఈ సినిమాపైనే ఉన్నాయి. అంతేకాకుండా ‘రంగస్థలం’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుకుమార్ రూపొందిస్తున్న సినిమా.

అల వైకుంఠపురంలో’ సినిమా తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా ఇది కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ కోసం కేరళ వెళ్లాలని ప్లాన్ చేయగా.. కరోనా వచ్చి అన్నిటిని తారుమారు చేసింది. శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన ఈచిత్రం ఫస్ట్ లుక్ అంచనాలను పెంచేసింది.

allu arujun,pushpa,lorry dirver,sukumar,hero ,అల్లు అర్జున్, లారీ డ్రైవర్, పుష్ప, సినిమా, సుకుమార్


రాయలసీమలోని చిత్తూరు యాస భాషతో పాటు అల్లు అర్జున్ మొరటు కుర్రాడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా మన నేటివిటీకి దగ్గరగా సహజత్వం ఉట్టిపడేలా పాత్రలు పండాలంటే లోకల్ గానే షూటింగ్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ చేసిందట. వీటికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రముఖ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

Tags :
|

Advertisement