Advertisement

  • చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య చిత్ర ఫస్ట్లుక్

చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య చిత్ర ఫస్ట్లుక్

By: chandrasekar Wed, 19 Aug 2020 12:14 PM

చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా ‘ఆచార్య  చిత్ర ఫస్ట్లుక్


బాలీవుడ్ తోపాటు టాలీవుడ్ లోనూ చాలా చిత్రాల షూటింగ్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో మ‌ధ్య‌లో నిలిచిపోయాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో వినోద‌ప‌రిశ్ర‌మ‌ కొంత వ‌ర‌కు గాడిలో ప‌డే అవకాశముంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కబోతుంది. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 22న చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

అభిమానులకు చిరంజీవి పుట్టినరోజు నాడు తాము అందించే బహుమతి ఇదని వెల్లడించింది. సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగులను మేళవిస్తూ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సహజ వనరుల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తిగా చిరంజీవి కనిపించబోతున్నారు.

ఈ సినిమాకు ‘ఆచార్య’ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు చిరంజీవి గతంలో ఓ వేడుకలో ప్రకటించారు. తాజాగా టైటిల్‌ లేకుండా చిత్రబృందం ప్రీలుక్‌ను విడుదలచేసింది. దాంతో ‘ఆచార్య’ టైటిల్‌ను కొనసాగిస్తారా? మరో టైటిల్‌ను నిర్ణయిస్తారా అనేది సస్పెన్స్‌గా మారింది. ఈ సినిమాలో రామ్‌చరణ్‌ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ అభిమానుల‌ను అంద‌రినీ అల‌రించ‌డం ఖాయ‌మైన‌ట్టే. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా వ‌స్తోన్న ఈ మూవీని సురేఖా కొణిదెల స‌మ‌ర్పిస్తుండ‌గా నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు. 2021లో ఈ మూవీ విడుద‌ల కానుంది.

Tags :

Advertisement