Advertisement

  • బుల్లితెర "నవ్యస్వామి" గురించి కొన్ని విషయాలు

బుల్లితెర "నవ్యస్వామి" గురించి కొన్ని విషయాలు

By: chandrasekar Tue, 23 June 2020 6:30 PM

బుల్లితెర "నవ్యస్వామి" గురించి కొన్ని విషయాలు


బుల్లితెర ప్రేక్షకులకు నవ్యస్వామి కూడా గుర్తుకొస్తుంది. ‘ఆమె కథ’లో అమాయకంగా కనిపించే ఈ కన్నడ యువతి అచ్చతెలుగు అమ్మాయిలా మారిపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. తెర మీద కనిపించేంత అమాయకురాలు కాదు నవ్య. నిజ జీవితంలో చాలా స్ట్రాంగ్‌. అనేక విషయాల మీద ఆమెకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, నవ్య ఈతరం అమ్మాయి.

ఆమె మాట్లాడే ప్రతి మాటలో ఆత్మవిశ్వాసం తొంగిచూస్తుంది. నేను పుట్టింది మైసూర్‌లో ఇంటర్‌ వరకు అక్కడే చదివాను. డిగ్రీ బెంగళూరులో పూర్తిచేశాను. చిన్నప్పటి నుంచీ బ్రైట్‌ స్టూడెంట్‌నే. కల్చరల్‌ యాక్టివిటీస్‌లో ముందుండేదాన్ని. స్కూల్‌లో ఏ చిన్న ప్రోగ్రామ్‌ జరిగినా నేను ఉండాల్సిందే. కానీ, ఎప్పుడూ యాక్టర్‌ కావాలని అనుకోలేదు. అలంకరించుకోవడం నాకు అసలు తెలియదు. ప్రోగ్రామ్స్‌లో కూడా ముఖానికి మేకప్‌ వేసిందీ లేదు. అంతేకాదు మెమరీ పవర్‌ కాంపిటీషన్‌లో నాకు ఎప్పుడూ ఫస్ట్‌ లేదా సెకెండ్‌ ప్రైజ్‌ వచ్చేది.

యాంకరింగ్‌ అయితే చదువుకోవడానికి కూడా సమయం ఉంటుంది. అలా, ఈ రంగుల ప్రపంచం నేను డిగ్రీలో జాయిన్‌ అయ్యేలా చేసింది. అటు చదువు, ఇటు యాంకరింగ్‌ రెండూ బ్యాలెన్స్‌ చేసుకున్నాను. టాప్‌ టెన్‌ షో అనే సినిమా ప్రోగ్రామ్‌ నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. అది చేస్తున్నప్పుడే సినిమా ఆఫర్‌ వచ్చింది. మంచి హిట్‌! కానీ, నాకు మాత్రం సినిమాకంటే బుల్లితెరే బెటర్‌ అనిపించింది. వెనక్కి వచ్చేశాను.

బాలాజీ టెలీఫిల్మ్స్‌ వారి కన్నడ సీరియల్‌లో ఆఫర్‌. అలా బిజీ అయిపోయా. సినిమా అవకాశాలు కూడా వదులుకొని సీరియల్స్‌నే కొనసాగించాను. కన్నడలో మూడు సీరియల్స్‌ చేశాను. ఆ తర్వాత ఒక తెలుగు సీరియల్‌. కొంతకాలం బ్రేక్‌ తీసుకున్నాను. అప్పుడే తమిళంలో ఆఫర్‌ వచ్చింది. నాకు భాషలు నేర్చుకోవడం ఇష్టం. అందుకే ఆ సీరియల్‌ కూడా ఒప్పుకొన్నా. రెండు సంవత్సరాలపాటు అక్కడ పనిచేశాను.

తమిళంలో చేస్తున్నప్పుడు తెలుగు ఆఫర్‌ వెతుక్కుంటూ వచ్చింది. నాకు ప్రామ్టింగ్‌ ఇవ్వడం నచ్చదు. అందుకే డైలాగ్స్‌ ముందే నేర్చుకునేదాన్ని. ఇంగ్లిష్‌లో రాసుకొని మరీ తెలుగు నేర్చుకున్నా. తొలిరోజుల్లో, తెలుగుభాష నేర్చుకోవాలన్న నా ఆరాటం చాలా కష్టాలే తెచ్చిపెట్టింది. అంతా ఆటపట్టించేవారు. ‘జఫ్పా’ అనే మాటకు తెలుగులో ‘బాబు’ అన్న అర్థం వస్తుందని చెప్పేవారు. దీంతో, నా అసిస్టెంట్‌ని అలాగే పిలిచేదాన్ని. అందరూ నవ్వుతుంటే ముందు నాకు అర్థం కాలేదు. తర్వాత ఎవరో అసలు విషయం చెప్పారు. చాలా నవ్వుకున్నా. దాదాపు మూడు సంవత్సరాలు బిజీబిజీగా ఉన్నా.

నిత్య ప్రయాణాలతో చాలా ఇబ్బంది పడ్డాను. ఏదో ఒక భాషలో స్థిరపడాలని ఆ సమయంలోనే అనుకున్నా. అప్పుడే స్టార్‌ మాలో ‘ఆమె కథ’లో చాన్స్‌ వచ్చింది. అస్తిత్వం కోసం ఓ ఆడపిల్ల పోరాటమే ఈ కథ. నా ఆలోచనలకు, భావాలకు చాలా దగ్గరగా అనిపించింది. వెంటనే అంగీకరించాను. ‘ఆమె కథ’ ప్రేక్షకులకు బాగా నచ్చుతున్నది. కథలో చాలా ట్విస్ట్‌లు ఉంటాయి. మీరే చూస్తారుగా? మంచి చాన్స్‌ వస్తే సినిమాల్లో చేయడానికీ సిద్ధంగా ఉన్నాను.

చిన్నప్పటి నుంచీ డాక్టర్‌ని కావాలని కలలు కనేదాన్ని. అందుకే బయాలజీ తీసుకున్నా. ఇంటర్‌ అయ్యాక ఎంసెట్‌ కూడా రాశాను. ఎంబీబీఎస్‌లో జాయిన్‌ అవ్వాలనుకున్నా. కానీ, మెడిసిన్‌ అంటే వేరేచోట ఉండాలి. దీంతో, ఇంట్లో వాళ్లు ‘తర్వాత ఆలోచిద్దాంలే’ అన్నారు. ఆ ఖాళీ సమయంలో ఏం చేయాలి? అన్న ప్రశ్న తెలిసిన అంకుల్‌ ఒకరు, యాంకర్‌ ఆడిషన్‌ గురించి చెప్పారు. కాలక్షేపానికి చేద్ద్దామనుకున్నా ఫొటోలు పంపమంటే పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో పంపించా. స్టిల్స్‌ దిగాలని కూడా అప్పట్లో తెలియదు. ఆ ఫొటోలే చూసి నన్ను సెలెక్ట్‌ చేశారు. ఆడిషన్‌కి రమ్మన్నారు. భయంభయంగా వెళ్లాను. అప్పటికే చాలామంది వచ్చారు. చివరికి నన్ను సెలెక్ట్‌ చేశారు. అలా, యాంకర్‌గా నా కెరీర్‌ మొదలైంది.

నేను ఐశూ ఒక సీరియల్‌లో కలిసి పనిచేశాం. ఆ సమయంలో మా అమ్మా, వాళ్లమ్మా ఫ్రెండ్స్‌ అయ్యారు. అప్పుడే మాటల సందర్భంలో మా అన్నయ్యకూ, తనకూ పెండ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. ఆ విషయం తెలియగానే, మొదట సంతోషించింది నేనే. నా ఫ్రెండే నాకు వదినగా వస్తుందని తెలిసి ఆనందపడ్డాను. తను చాలా క్యూట్‌. ఇక మా అన్నయ్య కూడా నాకు మంచి ఫ్రెండ్‌. ఏ విషయాన్ని అయినా మొదట తనకే చెప్పేదాన్ని.

Tags :

Advertisement