Advertisement

  • రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తే తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేను ..అభిషేక్ బచ్చన్

రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తే తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేను ..అభిషేక్ బచ్చన్

By: Sankar Sun, 28 June 2020 7:02 PM

రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తే తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేను ..అభిషేక్ బచ్చన్



అమితాబ్ బచ్చన్ ముద్దుల తనయుడు , ఐశ్వర్య రాయి భర్త అభిషేక్ బచ్చన్ ఎందుకో తండ్రి , భార్యలాగా బాలీవుడ్ లో స్టార్ గా ఎదగలేకపోయాడు ..హిట్ సినిమాలు ఉన్నప్పటికీ స్టార్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయారు ..అయితే అతడు తొలిసారిగా న‌టించిన వెబ్ సిరీస్‌ "బ్రీత్: ఇంటు ద షాడోస్"‌ చిత్రం విడుద‌ల‌ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడాడు.

ఎనిమిదేళ్ల‌ కూతురు ఆరాధ్య‌ త‌న‌ను ఎంత‌గానో మార్చివేసిందంటున్నాడు. "రొమాంటిక్‌ స‌న్నివేశా‌ల్లో న‌టించడానికి నేను ఇబ్బందిప‌డుతున్నాను. ఎందుకంటే అలాంటి సీన్ల‌లో న‌న్ను చూసేందుకు నా కూతురు ఇబ్బందిప‌డ‌టం ఇష్టం లేదు..అందుకే సినిమాకు సైన్ చేసేముందు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు కండిష‌న్స్ కూడా పెడుతున్నాడు. ఈ విష‌యాన్ని అత‌నే స్వ‌యంగా వెల్ల‌డించాడు.

వాటి గురించి ఆరాధ్య‌ అడిగే ప్ర‌శ్న‌ల‌కు నేను స‌మాధానం చెప్ప‌లేను. కాబ‌ట్టి ఏదైనా సినిమా ఒప్పుకునేముందు అందులో శారీర‌క సంబంధం, రొమాంటిక్ సీన్లు ఎక్కువ‌గా ఉన్నాయని తెలిస్తే ముందే ఆ చిత్రం నుంచి త‌ప్పుకుంటాను. అలా ఎన్నో సినిమాలు వ‌దులుకున్నాను. కానీ దీని గురించి ఎప్పుడూ బాధ‌ప‌డలేదు" అని తెలిపాడు. కాగా అభిషేక్ న‌టించిన‌ లూడో, బాబ్ బిస్వాస్‌, ద బిగ్ బుల్ చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌లకు సిద్ధంగా ఉండ‌గా మ‌రో నాలుగు ప్రాజెక్టులకు సైన్ చేశాడు.

Tags :
|
|
|

Advertisement