Advertisement

  • దర్శకుడిని స్క్రీన్ టెస్ట్‌లో మెప్పించలేక పోయిన ఆమీర్ ఖాన్ తనయుడు...

దర్శకుడిని స్క్రీన్ టెస్ట్‌లో మెప్పించలేక పోయిన ఆమీర్ ఖాన్ తనయుడు...

By: chandrasekar Wed, 21 Oct 2020 1:20 PM

దర్శకుడిని స్క్రీన్ టెస్ట్‌లో మెప్పించలేక పోయిన ఆమీర్ ఖాన్ తనయుడు...


హిందీ చిత్ర పరిశ్రమ నుంచి చూస్తే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అన్ని ఇండస్ట్రీస్‌లో వారసులే సినీ పరిశ్రమని ఏలుతున్నారు. అందులో వారసులు కూడా ప్రేక్షకులను మెప్పిస్తేనే ఇండస్ట్రీలో ఉండ గలుగుతారు. లేకపోతే.. వెనకాల ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా టాలెంట్ లేకపోతే.. ఒకటి రెండు సినిమాలకే పరిమితం కావాల్సి వస్తోంది. ఇలా ఎంతో మంది వారసులు ఒకటి అరా సినిమాల తర్వాత ఇంటికి వెళ్లి పోయారు. ఇక వారసులను ప్రేక్షకులపై రుద్దదానికీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్ని చేస్తారు. చివరకు టాలెంట్ ఉంటనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలుగుతారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత ఇండస్ట్రీలో నెపోటిజంపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇలాంటి సందర్భంలో ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్.. బాలీవుడ్ ఎంట్రీపై సర్వత్రా ఆసక్తి రేగింది. ఆమీర్ ఖాన్ తనయుడు గత మూడేళ్లుగా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.

ఇక జునైద్.. మలయాళంలో హిట్టైన ‘ఇష్క్’ సినిమా రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడని బీ టౌన్ మీడియా టాక్. కానీ ఇందులో నిజం లేదంటున్నారు. ఈ సినిమాను నిర్మించే నీరజ్ పాండే నిర్వహించిన ఆడిషన్స్‌లో జునైద్ ఖాన్.. అతన్ని మెప్పించలేకపోయాడట. అందుకే ఈ సినిమాలో అతన్ని తీసుకోలేదని సమాచారం. ఇదొక్కటే కాదు గతంలో నాలుగు ఐదు ఆడిషన్స్‌లో పాల్గొన్న ఎందులో కూడా సెలెక్ట్ కాలేకపోయాడు. ఈ లోపు జునైద్.. తన తండ్రి హీరోగా నటించిన ‘పీకే’ సినిమా కోసం రాజ్ కుమార్ హిరానీ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసాడు. దీంతో పాటు ‘మాస్టర్ మైండ్స్’ అనే ఓ టీవీ షోకు పనిచేసాడు. ఈ సందర్భంగా ఆమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ....తన పిల్లలు ఇరా, జునైద్.. ఫిల్మ్ ఇండస్ట్రీలో రావాలనుకుంటే.. రావచ్చు. దానికోసం వారిరువురు ఒక స్ట్రగులర్ ఎలా అయితే కష్టపడతారో అలా కష్టపడి అవకాశాలు దక్కించుకోవాలి. అంతేకాదు తమ టాలెంట్‌తో స్క్రీన్ టెస్ట్ పాస్ కావాలన్నారు. వీరి ఎంట్రీ కోసం తనెలాంటి సిఫారసు చేయనని చెప్పాడు. వాళ్లిద్దరు వాళ్ల టాలెంట్‌తోనే పైకి రావాలన్నారు. అలా వస్తేనే.. ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారని తెలిపారు. ఇక ఇరా, జునైద్ ఖాన్ విషయానికొస్తే వీరిద్దరు ఆమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్త పిల్లలు. ఆమెకు విడాకులు ఇచ్చిన తర్వాత కిరణ్ రావు‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరికి ఆజాద్ రావు ఖాన్ అనే కొడుకు ఉన్నాడు.

Tags :
|

Advertisement