Advertisement

  • టర్కీ లో ఆమిర్ ఖాన్ క్రేజ్ చూస్తే మతి పోవాల్సిందే ..

టర్కీ లో ఆమిర్ ఖాన్ క్రేజ్ చూస్తే మతి పోవాల్సిందే ..

By: Sankar Thu, 13 Aug 2020 1:19 PM

టర్కీ లో ఆమిర్ ఖాన్ క్రేజ్ చూస్తే మతి పోవాల్సిందే ..



బాలీవుడ్‌ హీరోల్లో అమీర్‌ఖాన్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా జరిగిన ఓ సంఘటనతో అమీర్‌కు విదేశాల్లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉన్న విషయం తెలుస్తోంది. టర్కి ఎయిర్‌ పోర్టులో అతన్ని అభిమానులు చుట్టిముట్టి సెల్ఫీలు తీసుకుంటున్న ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

అమీర్‌ఖాన్‌, కరీనాకపూర్‌ జంటగా నటిస్తున్న కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘లాల్‌సింగ్‌ చద్దా’. ఈ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌ను చిత్రం బృందం టర్కిలో ప్లాన్‌ చేసింది. దీంతో సినిమా షూటింగ్‌లో పాల్గొనడానికి ఇటీవల అమీర్‌ టర్కి వెళ్లారు. అక్కడి ఎయిర్‌ పోర్టులో అభిమానులు సెల్ఫీల కోసం ఆయన‌పై ఎగబడ్డారు. ఆయన కళ్లజోడు పెట్టుకొని, ముఖానికి మాస్క్‌ ధరించి కనిపిసున్నారు.

‘టర్కీలో ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ స్టార్ అమీర్ ఖాన్’ అని ఓ అభిమాని ట్విటర్‌లో అమీర్‌ వీడియోను పొస్ట్‌ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లు వాయిదా పడిన విషయం తెలిసిందే. షూటింగ్‌ అనుమతులు ఇచ్చిన అనంతరం విదేశాల్లో​ షూటింగ్‌ చేస్తున్న రెండో సినిమా ‘లాల్‌సింగ్‌ చద్దా’. మొదటి సినిమా అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్న బెల్‌ బాటబ్‌. ఈ మూవీ షూటింగ్‌ లండన్‌లో జరుగుతోంది..

Tags :
|
|

Advertisement