Advertisement

‘ఆకాశం నీ హద్దురా’ ట్రైలర్ రిలీజ్...

By: chandrasekar Tue, 27 Oct 2020 03:16 AM

‘ఆకాశం నీ హద్దురా’ ట్రైలర్ రిలీజ్...


తమిళ స్టార్ హీరో సూర్య న‌టించిన త‌మిళ చిత్రం శూర‌రై పోట్రు విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సాలా ఖాదూస్ చిత్ర దర్శకురాలు సుధా కొంగర ప్రసాద్ దర్శకత్వం వహిస్తుండగా.. గునీత్ మొంగాతో కలిసి తన సొంత బ్యానర్ 2డి ఎంటర్ టైన్మెంట్‌పై సూర్య ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ ఆకాశమే నీ హద్దురా చిత్రంలో టాలీవుడ్ డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబు ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. కానీ కరోనా కారణంగా సినిమాను రిలీజ్ చేయలేదు. ఇటీవల అక్టోబర్‌ 30న ఓటీటీలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించిన చిత్రయూనిట్ మళ్లీ రిలీజ్ డేట్‌ను నవంబర్ 12కు మార్చింది. ఈ క్రమంలో దసరా సందర్భంగా చిత్ర యూనిట్ తాజాగా అఫిషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఇందులో హీరో సూర్య, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చెప్పే డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి.

Tags :
|

Advertisement