Advertisement

సెన్సార్‌ పూర్తయిన ‘ఆకాశ‌ం నీ హ‌ద్దురా’

By: chandrasekar Mon, 08 June 2020 4:17 PM

సెన్సార్‌ పూర్తయిన ‘ఆకాశ‌ం నీ హ‌ద్దురా’


సూర్య, అపర్ణా బాలమురళి జంట గా నటిస్తున్న తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’ తెలుగులో ఈ చిత్రం ‘ఆకాశ‌ం నీ హ‌ద్దురా’ పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మంచు మోహన్‌బాబు కీల‌క పాత్ర‌లో న‌టించారు. జీవీ ప్రకాష్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. ఏప్రిల్‌ లేదా మే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక నిషేధాజ్ఞల కారణంగా వాయిదా పడింది. ఇటీవల సెన్సార్‌ పూర్తయిన ఈ చిత్రానికి ‘యు’ సర్టిఫికెట్‌ లభించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

aakasam nee haddhuraa,completes,the sensor,approval,people ,సెన్సార్‌, పూర్తయిన, ఆకాశ‌ం నీ హ‌ద్దురా,చిత్రాన్ని, ఆగస్టు


ఈ మూవీలో సూర్య పైలట్‌గా కనిపించనున్నట్లు సమాచారం. తెలుగులో ‘గురు’సినిమాతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న లేడీ డైరెక్టర్‌ సుధా కొంగర చాలా గ్యాప్‌ తర్వాత ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తుండటం విశేషం. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య నిర్మిస్తున్నారు. తమిళ, తెలుగు హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది. జాకీష్రాఫ్, కరుణాస్‌లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు.

Tags :

Advertisement