Advertisement

  • పుష్ప సినిమాపై స్పందించిన 'రంగస్థలం' నటుడు

పుష్ప సినిమాపై స్పందించిన 'రంగస్థలం' నటుడు

By: Sankar Wed, 08 July 2020 6:42 PM

పుష్ప సినిమాపై స్పందించిన 'రంగస్థలం' నటుడు



సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో అందరికి తెల్సిందే ..ఆ సినిమాలో రామ్ చరణ్ నటనకు అద్భుత ప్రశంసలు వచ్చాయి ..అయితే రామ్ చరణ్ తో పాటు అంతే స్థాయిలో గుర్తింపు పొందిన నటుడు ఆది పినిశెట్టి ..రామ్ చరణ్ అన్న పాత్రలో ఆది అదరగొట్టాడు ..అయితే సుకుమార్ అల్లు అర్జున్ తో పుష్ప అనే మూవీ తీస్తున్నాడు ..ఈ సినిమాలో కూడా ఆది మరొక కీలక పాత్ర చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి ..

అయితే ఈ న్యూస్ పై ఆది క్లారిటీ ఇచ్చాడు. తాను ఈ చిత్రంలో నటించడం లేదని, తనపై వస్తున్న వార్తలన్నీ వట్టి పుకార్లేనని చెప్పాడు. పుష్ప సినిమాకు సంబంధించి తనను ఎవరూ సంప్రదించలేదని ఆది చెప్పినట్టు ఇన్ సైడ్ టాక్. ఆది ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు. కీర్తిసురేశ్ తో గుడ్ లక్ సఖి చిత్రంతోపాటు ఆకాంక్ష సింగ్ తో కలిసి స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న సినిమా చేస్తున్నాడు. అయితే ఆది రామ్ చరణ్ రంగస్థలం సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. మరి పుష్ప సోదరుడు ప్లేసులో ఎవరు నటిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ను విడుదల చేయనున్నారు. బన్నీ కెరీర్లో ఒకేసారి ఐదు భాషల్లో విడుదల కానున్న తోలి సినిమా ఇదే. అలాగే అడవి నేపథ్యంలో చిత్తూరు యాసలో మాట్లాడే మాస్ యువకుడిగా ఆయన ఈరోల్ చేయడం కూడా ఇదే మొదటిసారి.ఇక పుష్పలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Tags :
|

Advertisement