Advertisement

  • సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆదాశర్మ దోసెలు

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆదాశర్మ దోసెలు

By: chandrasekar Mon, 31 Aug 2020 9:37 PM

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆదాశర్మ దోసెలు


సోష‌ల్ మీడియాలో బ్యూటీ ఆదాశ‌ర్మ చాలా యాక్టివ్‌గా ఉంటుంద‌నే సంగ‌తి తెలిసిందే. ప‌లు ఆస‌నాల‌తో సంద‌డి చేస్తూ ఉంటుంది. ఈ అమ్మ‌డు తాజాగా ఓ ఆస‌క్తిక‌ర వీడియో షేర్ చేసింది. ఇందులో దోసె పోస్తూ సంద‌డి చేసింది.

ఆదా దోసెకి అభిమానులు ఫిదా అవుతున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. చాలా కాలం త‌ర్వాత ఆదాశ‌ర్మ‌ తెలుగులో క్వ‌శ్చన్ మార్క్ అనే చిత్రం చేస్తుంది. విప్రా దర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమా ‘హారర్‌ కథాంశంతో తెరకెక్కుతుంది.

క్వశ్చన్‌మార్క్‌ వెనకున్న కథేమిటన్నది ఉత్కంఠను పంచుతుంది. తన జీవితంలోని శేషప్రశ్నలకు సమాధానం కోసం అన్వేషిస్తూ ఓ యువతి సాగించే ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం. హైదరాబాద్‌తో పాటు మహారాజపురం అడవుల్లో చిత్రీకరణ జరిపారు.

Tags :
|

Advertisement