Advertisement

ఓ యువతి జన్మరహస్యం 'జ'

By: chandrasekar Tue, 03 Nov 2020 3:02 PM

ఓ యువతి జన్మరహస్యం 'జ'


సైదిరెడ్డి చిట్టెపు దర్శకత్వం వహిస్తూ హిమజ, ప్రతాప్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘జ’. జై దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై గోవర్ధన్‌ రెడ్డి కందుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ లోగోను గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ విడుదలచేశారు.

నిర్మాత గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ‘హిమజ మంచి నటనను కనబరిచింది. నటిగా ఆమెకు మంచి పేరుతీసుకొచ్చే చిత్రమిది. దర్శకుడు సైదిరెడ్డి నాలుగు సంవత్సరాలు కష్టపడి ఈ కథను సిద్ధంచేశారు. త్వరలో విడుదల తేదీని వెల్లడిస్తాం’ అని పేర్కొన్నారు. హిమజ మాట్లాడుతూ ‘నటిగా నన్ను మరో మెట్టు ఎక్కించే చిత్రమిది. అభినయానికి ప్రాముఖ్యమున్న పాత్రను పోషించాను. నా పుట్టినరోజున ఫస్ట్‌లుక్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది.

దర్శకుడు మాట్లాడుతూ “జ’ జన్మ అని అర్థం. ఓ యువతి జన్మరహస్యం నేపథ్యంలో ఆసక్తికరంగా సాగుతుంది. ఒకే అక్షరంతో టైటిల్‌ ఎందుకు పెట్టామనేది ఆకట్టుకుంటుంది. హారర్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందిస్తున్నాం. అంతర్లీనంగా చక్కటి సందేశం ఉంటుంది’ అని పేర్కొన్నారు. సినిమాలో నాలుగు పాటలుంటాయని సంగీత దర్శకుడు వెంగీ తెలిపారు. ఈ వేడుకలో శివజ్యోతి, అప్పిరెడ్డి పాల్గొన్నారు.

Tags :
|
|
|
|

Advertisement